Varanasi – Warangal – Vijayawada : కాశీ యాత్రకు స్పెషల్ ట్రైన్స్ వయా వరంగల్, విజయవాడ

Varanasi - Warangal - Vijayawada : ‘కాశీ - తమిళ్ సంగమం’ రెండో ఎడిషన్‌ వేడుకలను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.

  • Written By:
  • Updated On - December 18, 2023 / 12:36 PM IST

Varanasi – Warangal – Vijayawada : ‘కాశీ – తమిళ్ సంగమం’ రెండో ఎడిషన్‌ వేడుకలను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈనేపథ్యంలో రైల్వేశాఖ డిసెంబరు 17 నుంచి డిసెంబరు 30 మధ్య  వారణాసికి ప్రత్యేక రైళ్లను నడపనుంది. కన్యాకుమారి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, కొయంబత్తూర్ జంక్షన్‌ల నుంచి వారణాసికి ఈ రైళ్లు నడుస్తాయి. ఇవి వరంగల్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. కాశీ యాత్రకు వెళ్లాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. కాశీ తమిళ్ సంగమం క్యాంపైన్‌లో భాగంగా వారణాసికి ఈ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈ రైళ్ల రిజర్వేషన్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసికి వెళ్లాలనుకునే భక్తులు ఈ రైళ్లల్లో రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆయా ట్రైన్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం…

We’re now on WhatsApp. Click to Join.

  • కొయంబత్తూర్ – వారణాసి స్పెషల్ ట్రైన్ (రైలు నెంబర్ 06105) రైలు డిసెంబర్ 19న తెల్లవారుజామున 4.30 గంటలకు కొయంబత్తూర్‌లో బయలుదేరి డిసెంబర్ 20న తెల్లవారుజామున 4.30 గంటలకు వారణాసికి చేరుకుంటుంది. ఈ రైలు మార్గం మధ్యలో డిసెంబరు 19న రాత్రి 9.45 గంటలకు విజయవాడలో, అర్ధరాత్రి 12.30 గంటలకు వరంగల్‌లో(Varanasi – Warangal – Vijayawada) ఆగుతుంది.
  • కన్యాకుమారి – వారణాసి స్పెషల్ ట్రైన్ (06107) డిసెంబర్ 20న రాత్రి 8.55 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి డిసెంబర్ 22న తెల్లవారుజామున 4.30 గంటలకు వారణాసికి చేరుకుంటుంది. ఈ రైలు మార్గం మధ్యలో డిసెంబర్ 21న రాత్రి 7.40 గంటలకు విజయవాడలో, రాత్రి 10.50 గంటలకు వరంగల్‌లో ఆగుతుంది.
  • వారణాసి – చెన్నై సెంట్రల్ స్పెషల్  రైలు (06102) డిసెంబర్ 20న రాత్రి 11.20 గంటలకు వారణాసిలో బయలు దేరి డిసెంబర్ 22న సాయంత్రం 4.45 గంటలకు చెన్నై‌కి చేరుకుంటుంది. ఇది డిసెంబర్ 22న తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్‌లో, ఉదయం 9 గంటలకు విజయవాడ‌లో ఆగుతుంది.
  • వారణాసి – కన్యాకుమారి స్పెషల్  రైలు (06104) డిసెంబర్ 24న తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్‌లో, ఉదయం 9 గంటలకు విజయవాడలో ఆగుతుంది.
  • ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – వారణాసి స్పెషల్  రైలు (06109) డిసెంబర్ 23న రాత్రి 10 గంటలకు విజయవాడలో, అర్ధరాత్రి 1.20 గంటలకు వరంగల్‌లో ఆగుతుంది.
  • వారణాసి – కొయంబత్తూర్ స్పెషల్  రైలు (06106) డిసెంబర్ 26న తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్‌లో, ఉదయం 9 గంటలకు విజయవాడలో ఆగుతుంది.
  • కొయంబత్తూర్ – వారణాసి స్పెషల్ రైలు (06111) డిసెంబర్ 25న రాత్రి 9.45 గంటలకు విజయవాడలో, అర్ధరాత్రి 12.30 గంటలకు వరంగల్‌లో ఆగుతుంది.
  • వారణాసి – కన్యాకుమారి స్పెషల్ రైలు (06108) డిసెంబర్ 28న తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్‌లో, ఉదయం 9 గంటలకు విజయవాడలో ఆగుతుంది.
  • ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – వారణాసి స్పెషల్ రైలు (06113) డిసెంబర్ 27న రాత్రి 10 గంటలకు విజయవాడలో, అర్ధరాత్రి 1.20 గంటలకు వరంగల్‌లో ఆగుతుంది.
  • వారణాసి – చెన్నై స్పెషల్ రైలు (06110) డిసెంబర్ 30న తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్‌లో, ఉదయం 9 గంటలకు విజయవాడ‌లో ఆగుతుంది.
  • వారణాసి – కొయంబత్తూర్  స్పెషల్ రైలు (06112) డిసెంబర్ 26న తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్‌లో, ఉదయం 9 గంటలకు విజయవాడ‌లో ఆగుతుంది.
  • వారణాసి – చెన్నై స్పెషల్ రైలు(06114) జనవరి 3న తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్‌లో, ఉదయం 9 గంటలకు విజయవాడలో ఆగుతుంది.