Site icon HashtagU Telugu

Rohit Sharma: హైదరాబాద్ లో 60 అడుగుల రోహిత్ శర్మ కటౌట్.. ఓ క్రికెటర్‌కి భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి..!

Rohit Sharma

Resizeimagesize (1280 X 720) (1)

భారత క్రికెట్ జట్టు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఏప్రిల్ 30న 36వ ఏట అడుగుపెట్టనున్నారు. నిజానికి ఏప్రిల్ 30వ తేదీన రోహిత్ శర్మ పుట్టినరోజు. అయితే, హైదరాబాద్‌ (Hyderabad)లో రోహిత్ శర్మ అభిమాని 60 అడుగుల ఎత్తైన కటౌట్‌ను తయారు చేశాడు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ చరిత్రలో లేని అతి పెద్ద కటౌట్ ఇదే. హైదరాబాద్‌లో నివసించే రోహిత్ శర్మ అభిమాని తన అభిమాన క్రికెటర్ 60 అడుగుల పొడవైన కటౌట్‌ను తయారు చేశాడు.

అయితే.. ఈ కటౌట్‌ని ఏప్రిల్ 30వ తేదీన అంటే నేడు రోహిత్ శర్మ పుట్టినరోజున హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కి ఇంత పెద్ద కటౌట్‌ లేదు. అయితే రోహిత్ శర్మపై ఈ అభిమాని క్రేజ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది కాకుండా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. భారత్‌లో ఓ క్రికెటర్‌కి ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి. సాధారణంగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్డులో సినిమా హీరోల భారీ కటౌట్లు ఉంటాయి. కానీ రోహిత్ శర్మ బర్త్‌డే కారణంగా ప్రత్యేకంగా అతని కటౌట్‌ను సిద్దం చేశారు ఫ్యాన్స్.

Also Read: Umesh Yadav: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఉమేష్ యాదవ్‌ కు గాయం..?

అయితే.. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ అంత బాగాలేదు. ఈ జట్టు ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా, అందులో 3 విజయాలు మాత్రమే సాధించగా.. 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.