Shock : 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు..కానీ ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు

Shock : ఇందిరమ్మ ఇల్లు ఆశతో ఉన్నా, ఇల్లు ఉన్నవారికే ఇళ్లు మంజూరు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Uppal Malsur

Uppal Malsur

రాజకీయాల్లో ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన నాయకుల కథలు విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి ఒక ఘనత పొందిన నాయకుడు ఉప్పల మల్సూరు (EX MLA Uppala Malsoor). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సిపిఎం (CPM) పార్టీ తరపున సూర్యాపేట నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే(4 Times MLA)గా గెలిచిన మల్సూరు జీవితం ఇప్పటికీ సాదాసీదాగా ఉంది. 1952 నుంచి 1972 వరకు వరుసగా నలుసార్లు గెలిచి, ప్రజల సమస్యల కోసం పోరాడిన మల్సూరు తాను నివాసముండేందుకు సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేకపోయారు.

చెప్పుల దుకాణం నుంచే జీవన పోరాటం

మల్సూరు సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందినవారు. హరిజన కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాబ్యాసాన్ని నాలుగో తరగతివరకే కొనసాగించారు. అతి చిన్న వయసులోనే సిపిఎం భావజాలాన్ని అనుసరించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజాసేవే ధ్యేయంగా పని చేసిన మల్సూరు తన ఎమ్మెల్యే హోదాను తనకు లాభం కోసం ఉపయోగించుకోలేదు. 1995లో సిరికొండ గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైనా, తన జీవనోపాధి మాత్రం చెప్పుల దుకాణం నుంచే కొనసాగించారు. రాజకీయ అధికారంలో ఉన్నప్పటికీ, అవినీతి దరిచేరనివ్వకపోవడం ఆయన నిజమైన ప్రజా నాయకుడిగా నిలిపింది.

మల్సూరు మరణించిన 2000 నుంచి ఇప్పటి వరకు, ఆయన కుటుంబం ప్రభుత్వాల దృష్టికి రావడం లేదు. ఇల్లు లేక అధిక కష్టాలపాలవుతున్నారు ఆయన కోడళ్ళు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, తమకు సరైన సహాయం లభించలేదని వాపోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఆశతో ఉన్నా, ఇల్లు ఉన్నవారికే ఇళ్లు మంజూరు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశగా చూస్తూ, కనీసం తమకు ఒక ఇల్లు మంజూరు చేస్తారని కోరుతున్నారు.

Congress Vs Shashi Tharoor: శశిథరూర్‌పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?

  Last Updated: 19 May 2025, 11:37 AM IST