Special MMTS Services In 17th & 18th On The Eve Of Ganesh Nimajjanam : హైదరాబాద్ (Hyderabad) నగరవాసులకు ఎంఎంటీఎస్(MMTS) గుడ్ న్యూస్ తెలిపింది. గణేష్ నిమజ్జనం (Ganesh Nimajjanam) సందర్భాంగా సెప్టెంబర్ 17, 18 తేదీల్లో 24 గంటల పాటు నిరంతరాయంగా MMTS సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో గణేష్ నిమజ్జన సంబరాలు అంబరాన్ని తాకుతాయనే సంగతి తెలిసిందే. ఈ సంబరాలను చూసేందుకు నగర వాసులే కాదు పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున నగరానికి చేరుకొని గణేష్ శోభాయాత్రను తిలకిస్తారు. ఈ తరుణంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది. నిమజ్జన సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా నిమజ్జనానికి సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ క్రమంలో నగర ప్రజలతో పాటు ఆయా జిల్లాల భక్తులకు 2 రోజుల పాటు ఎంఎంటీఎస్ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండనున్నాయి.
17న రాత్రి 11.10కి నిమిషాలకు హైదరాబాద్ నుంచి లింగంపల్లి, అదే రోజు రాత్రి 11.50 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ కు, 18న అర్థరాత్రి 12.10కి లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా, 18న రాత్రి 12.30కి హైదరాబాద్ నుంచి లింగంపల్లికి, 18న ఉదయం 1.50కి లింగంపల్లి నుంచి నుంచి హైదరాబాద్, 18న రాత్రి 2:20కి ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్, 18న రాత్రి 3:30కి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్, 18న ఉదయం 4:00 గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్ సర్వీసులు నడవనున్నాయి.
ఇటు వినాయక నిమజ్జనం సందర్భంగా వైన్ షాప్స్ మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు మూసేయాలని స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ ఊరేగింపులు సజావుగా ముగిసేందుకు ధైర్యంగా, స్వేచ్ఛగా పనిచేయాలని సీవీ ఆనంద్ అధికారులను సూచించారు. గురువారం సౌత్-ఈస్ట్ జోన్‌ను, ఈస్ట్ జోన్‌ను సందర్శించిన ఆయన, అధికారులతో సమావేశమయ్యారు. సున్నితమైన ప్రాంతాలు రెండు జోన్లలో ఉన్నాయని సీవీ ఆనంద్ అధికారులకు వివరించారు. కమ్యూనల్ రౌడీలు, ఇతర సంఘ విద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని సూచించారు.
Read Also : Sitaram Yechury : సీతారాం ఏచూరి మరణం ఫై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్