Site icon HashtagU Telugu

FISH PRASADAM : 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

'Fish Prasadam' to be distributed in Hyderabad on June 8

'Fish Prasadam' to be distributed in Hyderabad on June 8

FISH PRASADAM : మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం వితరణ జూన్ 8, 9 తేదీల్లో జరగబోతోంది. బత్తిని బ్రదర్స్ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులున్న వారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా చేప ప్రసాదం(FISH PRASADAM) తీసుకోనున్నారు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి జనం వస్తుంటారు. ఇతర రాష్ట్రాలవారు ఒకరోజు ముందే  హైదరాబాద్‌కు చేరుకొని లాడ్జీలు, హోటళ్లలో బస చేయనున్నారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ ఆర్టీసీ దాదాపు  130 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read : JDU – NDA : బీజేపీకి షాక్.. అగ్నివీర్ స్కీం, యూసీసీపై సమీక్షించాల్సిందేనన్న జేడీయూ

1847 సంవత్సరం నుంచే.. 

1847 సంవత్సరంలో హైదరాబాద్‌‌లో బత్తిని కుటుంబం చేప  ప్రసాదం పంపిణీని ప్రారంభించిందని  చెబుతుంటారు. అప్పట్లో వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేవారట. . ఆయన తర్వాత వారి వారసుడు బత్తిని శివరామ గౌడ్, ఆయన కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి వ్యాపించిన టైంలో చేప ప్రసాదం పంపిణీ రెండేళ్ల పాటు నిలిచిపోయింది. గతేడాది నుంచి చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. ఇందుకోసం ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Also Read : Rahul Dravid Warning: టీమిండియా కోచ్ రాహుల్ ద్ర‌విడ్ వార్నింగ్‌.. ఆట‌గాళ్ల‌లో టెన్ష‌న్‌..!