Site icon HashtagU Telugu

Speaker Gaddam Prasad Kumar: నెక్లెస్ రోడ్డులో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Speaker Gaddam Prasad Kumar

Speaker Gaddam Prasad Kumar

Speaker Gaddam Prasad Kumar: ప్రజాపాలన – విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) శ‌నివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, జీఏడీ కార్యదర్శి రఘునందన్, జీఏడీ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, తదితరులు పాల్గొన్నారు.

పలు పసందైన వంటకాలతో ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలంకరణతో మెరుస్తాన్నాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన పలు బ్రాండెడ్ హోటల్స్ ఈ ఫుడ్ స్టాళ్ళ కౌంటర్స్ ఏర్పాటు చేశాయి. హైదరాబాదీ బిర్యాని, మొగులాయి వంటకాలు, చాట్, ఐస్ క్రీం, నార్తన్ తదితర వెరైటీ ఫుడ్ స్టాళ్ళ ఏర్పాటు. హైదరాబాద్, మొగులాయి, తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో పాటు బేకరి ఐటమ్స్ ఐస్ క్రిమ్ పార్లర్లను విజయోత్సవాల్లో పాల్గోనే సందర్శకుల సౌకర్యార్థం వందకు పైగా ఫుడ్ స్టాళ్లను అందుబాటులొకి తెచ్చారు.

Also Read: CM Revanth: నల్లగొండ జిల్లా పోరాటాల పురిటిగడ్డ: సీఎం రేవంత్‌

అంతర్జాతీయంగా పేరోందిన హైద్రాబాదీ దమ్ బిర్యాని తోపాటు మొగలాయి, జఫ్రాని బిర్యాని పర్యాటకులకు అందించేందుకు ప్రముఖ హోటళ్ళయిన ప్యారెడైజ్, పిస్తా హౌజ్, షాదాబ్, బడేమియా కబాబ్ తదితర హోటళ్లు తమ బ్రాండ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వీటితోపాటు తెలంగాణ వంటకాలుగా పేరొందిన పాలమూరు గ్రీల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటు కోడి చికెను, పుడ్ జాయింట్స్ ను అందుబాటులోకి తెచ్చారు. నిలోఫర్ కెఫ్, బ్రౌన్ బేర్ బేకరిలు ప్రాంకిల్ మ్యాగి హాట్స్పాట్ కాంటినెంటల్ కాఫీ, ప్రాంకి అండ్ రోల్స్, మొమోస్ అండ్ ప్రైస్ తో పాటు గోకుల్ చాట్ కూడ తమ సంస్థ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేసారు. వీటి,తో పాటు ఆగ్రా చాట్ అండ్ స్వీట్స్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందిరా మహిళ శక్తి క్యాంటిన్లను కూడా ఏర్పాటు చేశారు.