Site icon HashtagU Telugu

Nalagonda: జనంతో మంత్రి జగదీశ్ రెడ్డికి జై కొట్టించిన ఎస్పీ..!!

Sp

Sp

తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఓ అధికారిక కార్యక్రమంలో సూర్యపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రసంగించారు. మంత్రి జగదీశ్ రెడ్డిని పొగడ్తలో ముంచెత్తారు. ఇప్పుడా ప్రసంగం వివాదాస్పదంగా మారింది. TRS కార్యకర్తగా జిల్లా ఎస్పీ నినాదాలు చేస్తూ..జగదీశ్ రెడ్డిని బాహుబలిగా అభివర్ణించాడు. మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ జయహో జగదీషన్న జయహో అంటూ సభా వేదికపై అందరితో నినాదాలు చేయించాడు. బాహుబలి సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు వచ్చే శబ్దం గోడలకు బీటలు వచ్చింది అని.. అలాంటి శబ్దాన్ని చేయాలంటూ జనాలతో జై కొట్టించారు. ఇప్పుడా వైరల్ గా మారింది.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యూనిఫాంలోఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారి బహిరంగంగా ఇలా మంత్రిని పొగడ్తలతో ముంచెత్తడం సిగ్గు చేటని విమర్శించారు. గతంలో కేసీఆర్ కాళ్లు మొక్కిన IAS అధికారికి ఎమ్మెల్సీ పదవి దక్కినట్లు…జగదీశ్ రెడ్డిని కీర్తిస్తే IPS అధికారికి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కడం ఖాయమంటూ సెటైర్లు వేశారు.