Telangana Rains : తెలంగాణలో పలుచోట్ల ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి పవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతో పాటు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. దాని ప్రభావంతో ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షం పడొచ్చు. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వానలు కురవొచ్చు. ఈనేపథ్యంలో పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయి. ఒకట్రెండు రోజుల్లో అవి తెలంగాణలోకి ప్రవేశిస్తాయి.
We’re now on WhatsApp. Click to Join
- ఆదివారం రోజు హైదరాబాద్, వరంగల్, మహబూబాబాద్, మెదక్, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల జోరుగా వాన కురిసింది.
- ప్రత్యేకించి హైదరాబాద్ పరిధిలో వర్షం కారణంగా పలు ప్రాంతాలలో రోడ్లు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకిి వరదనీరు చేరింది.
- మహబూబాబాద్ జిల్లాలో పలుచోట్ల చెట్లు విరిగిపడగా కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.