Sankranti Special Trains : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్‌ల నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు జనవరి 9 నుంచి 19 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
- సంక్రాంతికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్
- తెలంగాణ ఏపీ మధ్య 16 స్పెషల్ ట్రైన్లు
- ట్రైన్ల పూర్తి వివరాలివే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండగ. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి పండకు ఉండే హడావుడే వేరు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారు సంక్రాంతి పండక్కి స్వగ్రామాలకు చేరుకుంటారు. చాలా మంది బస్సులు, ప్రవేటు వాహనాలతో పాటు ట్రైన్లలో ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇప్పటికే ట్రైన్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే తెలంగాణ నుంచి ఏపీకి పండక్కి ఊరెళ్లేవారికి తీపి కబురు చెప్పింది. సంక్రాంతి సందర్భంగా 16 ప్రత్యేక ట్రైన్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్, వికారాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి శ్రీకాకుళం రోడ్‌క ఈ ట్రైన్ల రాకపోకలు సాగిస్తాయి. జనవరి 9 నుంచి 19 వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు సీపీఆర్వో ప్రకటన విడుదల చేశారు.
స్పెషల్ ట్రైన్ల వివరాలు..
- సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు (ట్రైన్ నెంబర్ 07288) జనవరి 9 నుంచి 11 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.
- శ్రీకాకుళం రోడ్డు- సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్ 07289 తిరుగు ప్రయాణంలో 3.30 గంటలకు శ్రీకాకుళం నుంచి బయల్దేరి మరుసటి రోజు 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ జనవరి 10-12 మధ్య అందుబాటులో ఉంటుంది.
- సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు ట్రైన్ నెంబర్ 07290 ట్రైన్ రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ఈ ట్రైన్ జనవరి 10-12, 16-18 తేదీల మధ్య అందుబాటులో ఉంటుంది.
- శ్రీకాకుళం రోడ్డు- సికింద్రాబాద్ ట్రైన్ తిరుగు ప్రయాణంలో 3.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ జనవరి 11-13, 17-19 తేదీల మధ్య అందాబులో ఉంటుంది.
- వికారాబాద్-శ్రీకాకుళం రోడ్డు ట్రైన్ జనవరి 13న 5.15 నిమిషాలకు వికారాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో 07295 నెంబర్ గల ట్రైన్ 3.30 గంటలకు శ్రీకాకుళంలో బయల్దేరి మరుసటి రోజు అంటే 14వ తేదీన సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది.
- సికింద్రాబాద్- శ్రీకాకుళం రోడ్డు ట్రైన్ జనవరి 17న రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07293 నెంబర్ గల ట్రైన్ జనవరి 18న 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
