Site icon HashtagU Telugu

Bandi On Komatireddy: కోమటిరెడ్డి చేరికపై ‘బండి’ క్లారిటీ!

Rajagopal Reddy

Rajagopal Reddy

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తెలంగాణ భారతీయ జనతా పార్టీలోకి చేరికపై ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో కోమటిరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్నారు. ఈమేరకు కోమటిరెడ్డి కొద్దిరోజుల క్రితం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారని తెలిపారు. ఖమ్మం, నల్గొండ నుంచి పలువురు భాజపాలో చేరుతారని ఆయన తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళితే కేసీఆర్‌పై టీఆర్‌ఎస్ శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలున్నాయని బండి సంజయ్ అన్నారు. శాసనసభ సభ్యులకు నిధులు కేటాయించడంలో కేసీఆర్ విఫలమయ్యారని,  నియోజకవర్గాలను సందర్శించే పరిస్థితి లేదని బండి సంజయ్ అన్నారు. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరుందుకు ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆయనపై సీరియఎస్ అయినట్టు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ పై ఎగురుబావుటా వేసిన మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేరికల కమిటీగా నియమితులైన విషయం తెలిసిందే. ఈటల రహస్యంగా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో ‘ప్రజల గోస బీజేపీ భరోసా’ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. స్థానిక టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. సరైన సమయంలో వివిధ పార్టీల నేతలు, నాయకులు బీజేపీలో చేరుతారని ఆయన స్పష్టం చేశారు.