Congress Manifesto: సోనియా గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ మేనిఫెస్టో

ఆదివారం తాజ్ కృష్ణా హోటల్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దేశంలో నిరుద్యోగం, రాజకీయ, ఆర్థిక, మణిపూర్, భూ ఆక్రమణ తదితర అంశాలపై చర్చించారు.

Congress Manifesto: ఆదివారం తాజ్ కృష్ణా హోటల్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దేశంలో నిరుద్యోగం, రాజకీయ, ఆర్థిక, మణిపూర్, భూ ఆక్రమణ తదితర అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ చెబుతున్న జమిలి ఎన్నికలను రాజ్యాంగం, సమాఖ్యవాదంపై దాడిగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. ఈ భేటీలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎజెండాపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు కానుంది.

నేడు తుక్కుగూడలో టి.కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ జరగనుంది. 10 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను సోనియా గాంధీ విడుదల చేయనున్నారు. 6 హామీల హామీ కార్డు విడుదల చేయబడుతుంది.

Also Read: AP : చంద్రబాబుని అరెస్ట్ చేసి.. జగన్ తాను తీసుకున్న గోతిలో తానే పడబోతున్నాడా..?