Site icon HashtagU Telugu

Congress Vijaya Bheri : 6 గ్యారంటీలను ప్రకటించిన సోనియా..అవేంటి అంటే..!

Sonia Gandhi to Announce 6 Guarantee Schemes

Sonia Gandhi to Announce 6 Guarantee Schemes

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా (Sonia Gandhi)..ఈసారి తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా హామీలు కురిపించింది. కర్ణాటక లో ఎలాగైతే ఉచిత హామీలతో విజయ డంఖా మోగించిందో..ఇప్పుడు తెలంగాణ లో కూడా అలాంటి హామీలతో విజయ డంఖా మోగించాలని చూస్తుంది.

అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ విజయ భేరి (Congress Vijayabheri Public Meeting) తో ఎన్నికలకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆరు గ్యారంటీలను సోనియా ప్రకటించబోతుందని ముందు నుండి చెపుతున్న కాంగ్రెస్…ఆ ఆరు గ్యారంటీలను ప్రకటించి ప్రజల్లో సంతోషం నింపింది. తెలంగాణ సోదరసోదరీమణులకు నమస్కారాలు అంటూ సోనియా తన స్పీచ్ స్టార్ట్ చేశారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఈరోజున కొన్ని పథకాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి నెరవేర్చేలా 6 గ్యారంటీలను (6 Guarantee Schemes) ప్రకటిస్తున్నానని తెలిపారు సోనియా.

సోనియా ప్రకటించిన గ్యారంటీలు (Sonia Gandhi to Announce 6 Guarantee Schemes) :

అంతకు ముందు తాజ్ కృష్ణ లో సిడబ్ల్యూసి(CWC) సమావేశాలు జరిగాయి. నిన్న , ఈరోజు ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా త్వరలో జరుగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. తెలంగాణలోనూ విజయం సాధించడం, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ రాష్ట్రాలపై నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. కర్నాటక మోడల్‌లోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ కర్నాటకలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర నాయకత్వం ఐక్యంగా ఉంటే ఎన్నికల్లో సులువుగా విజయం సాధించవచ్చునని పార్టీ హైకమాండ్ అభిప్రాయపడింది.

Read Also : Road Accident: మహారాష్ట్రలో తెలంగాణ వాసులు మృతి