Site icon HashtagU Telugu

TS Polls : రంగంలోకి దిగిన సోనియా..పీసీసీకి కీలక ఆదేశాలు

Congress Rajya Sabha Candidates

Sonia Sonia Gandhi Key Meet

తెలంగాణ ఎన్నికల (TS Polls) సమయం దగ్గర పడుతుండడం..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రావడం పక్క అంటూ పలు సర్వేలు చెపుతుండడం తో అధిష్టానం మరింత ఫోకస్ పెడుతుంది. తాజాగా సోనియా గాంధీ (Sonia Gandhi) సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఎన్నికల ప్రచారం..సభలు , సమావేశాలు , అధికార పార్టీ ఆలోచనలు ఇలా ప్రతిదాని ఫై మరింత ఫోకస్ పెట్టాలని పీసీసీ (PCC)కి సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే అసంతృప్తులపై కూడా ఓ కన్నేసి ఉంచాలని తెలిపినట్లు సమాచారం. గెలుపోటములను నిర్ణయంచే ముఖ్యమైన 40 స్థానాల లిస్టు ను రూపొందించిన హైకమాండ్ ఎప్పటికప్పుడూ ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులపై సమీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. సోనియాతో వర్చువల్ సమావేశంలో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోని, KC వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇక రేపటి నుండి రాష్ట్రంలో రాహుల్ (Rahul Tour) పర్యటిస్తున్నారు. రేపు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్​పోర్ట్​చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు పినపాకకు చేరుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో, కార్నర్ సమావేశం నిర్వహిస్తారు. పినపాక నుంచి హెలికాప్టర్‌​లో.. నర్సంపేటకు చేరుకుని 3 గంటల వరకు ప్రచారం చేస్తారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ చేరుకుంటారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర చేస్తారు. వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్‌లో కూడా ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గంలో రాజేంద్రనగర్ చేరుకుని అక్కడ ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళతారు.

Read Also : Chidambaram : చిదంబరం వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం