Site icon HashtagU Telugu

Sonia Gandhi : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ దూరం!

Sonia Gandhi away from Telangana Formation Day !

Sonia Gandhi away from Telangana Formation Day !

Telangana Formation Day: కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు(Telangana Formation Day) హాజరు కావడంలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనారోగ్య కారణాలతో ఆమె తెలంగాణ పర్యటనను( Telangana Tour) రద్దు చేసుకున్నట్లు సమాచారం అందింది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించిన సోనియా గాంధీ.. వేడుకలకు హాజరవుతారని మాటిచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం సోనియా గాంధీ హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో(Health problems) ఇబ్బంది పడుతున్న సోనియా ఈ పర్యటన విషయంలో తన వ్యక్తిగత వైద్యుడి సలహా కోరారు. సోనియా ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రయాణం మానుకుంటేనే మేలని వైద్యుడు చెప్పడంతో తెలంగాణ టూర్ ను ఆమె రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడంలేదని ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Read Also: Kalki Prelude : కల్కి ప్రీ ల్యూడ్.. నాగ్ అశ్విన్ తెలివైన పని..!

అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ(Sonia Gandhi) హాజరు కాలేకపోయినప్పటికి వీడియో సందేశం వినిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర అవతరణ వేడుకలకు స్పెషల్ గెస్ట్‌గా ఎవరొస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

 

 

 

Exit mobile version