Site icon HashtagU Telugu

CM Route : సెక్రటేరియట్‌లోని సీఎం కాన్వాయ్ రూట్‌లో మార్పులివే..

Cm Route

Cm Route

CM Route : తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌‌లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ రాకపోకలు సాగించే రూట్‌లో పలు మార్పులు జరగనున్నాయి. ఇప్పటి వరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి నేరుగా లోపలికి ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చేది. ఇకపై సెక్రటేరియట్ పశ్చిమ దిశలోని  గేటు నుంచి లోపలికి సీఎం కాన్వాయ్ ప్రవేశించనుంది. సెక్రటేరియట్ లోపలి నుంచి సీఎం కాన్వాయ్ బయటకు వెళ్లేందుకు ఈశాన్య దిశలోని గేటును వినియోగించనున్నారు. ఇకపై తెలంగాణ సెక్రటేరియట్‌లోని ఆగ్నేయ దిశలో ఉన్న గేటు(CM Route) ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో వాస్తుపరంగా ఈమేరకు మార్పులు చేయించినట్లు తెలుస్తోంది.  గతంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు మార్చాలని రేవంత్ ఆదేశించారు.  దీంతో ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో సీఎం కార్యాలయ ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయి.  సెక్రటేరియట్ లోపల మరికొన్ని మార్పులు, చేర్పులను సీఎం రేవంత్ చేయించనున్నారని తెలుస్తోంది.

Also Read :Vijay Mallya : మాల్యా, నీరవ్, చోక్సీల అరెస్టులో దర్యాప్తు సంస్థలు ఫెయిల్ : కోర్టు

రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇంఛార్జులు, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో ఇవాళ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ఉండవద్దన్నారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతే ఈవీఎంల లెక్కింపు అవుతుందని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.

Also Read :CEC Press Meet : ప్రపంచంలోనే పెద్ద ఎలక్షన్స్.. 64.2 కోట్ల మంది ఓటేశారు : సీఈసీ