BJP : ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన బిజెపి అధిష్టానం

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కీలక బాధ్యతలు

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 12:23 PM IST

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి (BJP)..కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రీసెంట్ గా రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ని తప్పించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి అధ్యక్ష పదవి బాధ్యతను అప్పగించిన అధిష్టానం..తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని బిజెపి పార్టీ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కు సోషల్ మీడియా బాధ్యతను అప్పగించింది.

ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) వాడకం ఎలా ఉందొ చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ద్వారా చాల పనులు అవుతున్నాయి. ప్రజలు సైతం సోషల్ మీడియా కు బాగా అలవాటుపడ్డారు. ప్రతి చిన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. అందుకే రాజకీయ నేతలు సైతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో బిజెపి సైతం సోషల్ మీడియా ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని , బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుందో తెలియజేయాలని చూస్తుంది. అందుకే ఎంపీ అరవింద్ కు సోషల్ మీడియా బాధ్యతలను అప్పగిస్తూ బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే కేసీఆర్ సర్కార్ అవినీతిని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంపీ అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగిస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చింది. మరి ఇంకా నుండి అరవింద్ తన దూకుడు ను ఇంకెంత స్పీడ్ చేస్తారో చూడాలి.

Read Also : KTR’s Birthday: సాట్స్ ఆధ్వర్యంలో అట్టహాసంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు!