Site icon HashtagU Telugu

BRS Strategy: బీఆర్ఎస్ కొత్త వ్యూహం.. సోషల్ మీడియా కీలకం

Brs Strategy

Brs Strategy

BRS Strategy: తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని మొదలు పెట్టింది. ప్రజలకు చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎఫ్‌ఎం రేడియో టాక్ షోలు, తెలుగు సినీ నటులతో ఇంటర్వ్యూల నుంచి యూట్యూబ్, లింక్డ్‌ఇన్‌ ఇలా వివిధ సోషల్ మీడియా ద్వారా ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది.

నవంబర్ 30న తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల కేటీఆర్ పార్టీ ప్రచారాన్ని సరికొత్తగా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ మధ్య మై విలేజ్ షో ద్వారా కేటీఆర్ వీక్షకుల్ని ఆకట్టుకున్నారు. రుచికరమైన నాటుకోడి కూరని తయారు చేసి సదరు యూట్యూబర్స్ కి రుచి చూపించాడు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి నుంచి ఉపాధి అవకాశాల కల్పన వరకు వివిధ అంశాలను వీక్షకులకు కేటీఆర్ వివరించారు.

మంత్రి కేటీఆర్ సినిమా వాళ్లతోను ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు ప్రముఖ తెలుగు హీరోలతో కేటీఆర్ ఇంటర్వ్యూలు త్వరలో బుల్లితెరపైకి రానున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 120 సోషల్ మీడియా వార్‌రూమ్‌లలో 750 మంది సిబ్బంది పార్టీ కోసం కంటెంట్‌ను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రజలకు గుర్తుచేస్తూ, నెగటివ్ కంటెంట్ కు వ్యతిరేకంగా వాస్తవకతను వివరించే కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా పోటీ చేసే అభ్యర్థికి సహాయపడే మైక్రో వార్ రూమ్ ఉంటుంది. మొత్తానికి 24 గంటలు టీవీ ఛానెల్‌లు, ఎఫ్ఎం రేడియో స్టేషన్‌లలో కేటీఆర్ ఇంటర్వ్యూలతో ప్రచారం చేయబోతున్నారు. తద్వారా ప్రజలలో బీఆర్ఎస్ నినాదం మరింత లోతుగా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17,000 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, వాటిలో 16 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. రోజూ వారికి కనీసం ఎనిమిది సందేశాలు టెక్స్ట్ లేదా వీడియో లేదా ఫోటో రూపంలో అందుతాయి. ఈ క్రమంలో అవసరమైన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారు.

Also Read: PM Modi : కాంగ్రెస్ గెలిచినప్పుడల్లా నక్సలైట్లు, టెర్రరిస్టులు బలోపేతమయ్యారు : ప్రధాని మోడీ

Exit mobile version