Drunk drive: వామ్మో.. రోజుకు ఇంతమంది పట్టుబడుతున్నారా.?

‘‘మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం’’ అంటున్నారు మనోళ్లు. మితిమీరి మద్యం తాగడమే కాకుండా... ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 26, 2021 / 05:13 PM IST

‘‘మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం’’ అంటున్నారు మనోళ్లు. మితిమీరి మద్యం తాగడమే కాకుండా… ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంటూ.. అందులో మందబాబులు చేసిన ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయట. ఈ ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 32,818 డ్రంక్ డ్రైవ్ కేసులు వెలుగుచూశాయి. అంటే సగటున రోజుకు 100 మందికిపైగా తాగి రోడ్డెక్కుతున్నారు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 32,818 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయని, ద్విచక్ర వాహనదారులపైనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 25,614 మంది ద్విచక్ర వాహనాలు మోతాదు కంటే ఎక్కువ తాగుతూ పట్టుబడ్డారు. అయితే పట్టబడుతున్నవాళ్లలో 1,055 ఆటో-రిక్షా డ్రైవర్లు, 5,947 ఫోర్-వీలర్లు మరియు 202 భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు. వారందరిపై కేసులు నమోదు చేశారు.

మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కమిషనరేట్ పరిధిలో 210 ప్రమాదాలు జరిగాయి. 232 మంది మరణించారు. వాహనదారులు మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల 30.07 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులకు పట్టుబడిన వారందరూ 35 ఏళ్ల లోపు వారే. అనుమతి కంటే ఎక్కువ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.