Prashant Kishor Report: టీఆర్ఎస్ కార్యాచరణపై ‘పీకే’ బిజీ బిజీ

సెప్టెంబరు 6లోగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయకపోతే లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి.

  • Written By:
  • Updated On - July 27, 2022 / 12:02 PM IST

సెప్టెంబరు 6లోగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయకపోతే లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర అసెంబ్లీ రద్దు ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమీక్షిస్తోంది. ముందస్తు ఎన్నికలపై పార్టీ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆగస్టులోగా తుది నివేదికను సమర్పించాలని టీఆర్‌ఎస్ ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్‌ను కోరారు. ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు స్థానానికి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టారు. వివిధ పార్టీల నాయకులను టీఆర్ఎస్ చేర్చుకోవాలని స్థానిక నేతలకు ఆదేశాలు ఇచ్చారు.

సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు, కొత్త రేషన్‌కార్డుల జారీ, పింఛన్‌ల విడుదల వేగవంతం చేయాలన్నారు. సెప్టెంబరు 6లోగా రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయకుంటే సాధారణ లోక్‌సభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే కర్నాటక, గుజరాత్ ఎన్నికలతో పాటు ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యేల పనితీరు, భవిష్యత్తుపై కార్యాచరణపై తుది నివేదిక ఇచ్చే పనిలో పీకే బీజీగా ఉన్నాడు.