Site icon HashtagU Telugu

Kavitha Vs Smriti : స్మృతి ఇరానీ అజ్ఞానం బయటపడింది.. కేంద్రమంత్రికి కవిత కౌంటర్

Kavitha Vs Smriti

Kavitha Vs Smriti

Kavitha Vs Smriti : ‘‘రుతుస్రావం వైకల్యమేం కాదు.. రుతుస్రావం రోజులకు వేతనంతో కూడిన సెలవులను ఇవ్వలేం’’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల నిజమైన బాధను విస్మరించేలా స్మృతి ఇరానీ మాట్లాడారని కవిత మండిపడ్డారు. ‘‘కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో నేను నిరుత్సాహపడ్డాను. ఇలాంటి అజ్ఞానంతో ఆమె మాట్లాడటం దారుణం. రుతుస్రావం రోజులకు వేతనంతో కూడిన సెలవులను నిరాకరించడం మహిళల నిజమైన బాధను విస్మరించడమే’’ అని కవిత కామెంట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘‘రుతుస్రావం అనేది బయోలాజికల్ రియాలిటీ. ఒక మహిళగా, మహిళలు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్ల పట్ల కేంద్ర మంత్రి ఇరానీకి సహానుభూతి లేకపోవడం బాధాకరం’’ అని ఆమె(Kavitha Vs Smriti) కామెంట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘రుతుచక్రం ఒక వైకల్యం కాదు. ఇది మహిళల జీవిత ప్రయాణంలో సహజమైన భాగం. ఇలా మహిళలకు ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం వల్ల పని ప్రదేశాల్లో వివక్షకు దారి తీస్తుంది. నెలసరి సెలవులు ఇవ్వాల్సి రావడం వల్ల కొన్ని సంస్థలు మహిళలను ఉద్యోగాల్లో నియమించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవు. దీని వల్ల మహిళలకు ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది’’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Also Read: Controversial – 2023 : ఈ ఏడాది అత్యంత వివాదాస్పదంగా మారిన అంశాలివీ..