Kagaznagar Train : సిర్పూర్‌ కాగజ్‌నగర్ రైలులో పొగలు

Kagaznagar Train : సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు వెళ్తున్న ట్రైన్‌‌కు ఆదివారం ఉదయం ప్రమాదం తప్పింది.

Published By: HashtagU Telugu Desk
Kagaznagar Train

Kagaznagar Train

Kagaznagar Train : సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు వెళ్తున్న ట్రైన్‌‌కు ఆదివారం ఉదయం ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే.. రైలులో నుంచి పొగలు వచ్చాయి.  ఇది గమనించిన ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. వెంటనే చైన్‌ లాగి ట్రైన్‌ను ఆపేశారు. దీనిపై రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో ట్రైన్‌ను(Kagaznagar Train) బీబీనగర్‌ స్టేషన్‌‌కు తీసుకెళ్లి  నిలిపివేశారు. రైలు ఇంజిన్‌ బ్రేక్‌ లైనర్లు బలంగా పట్టేయడంతోనే పొగలు వచ్చాయని రైల్వే సిబ్బంది గుర్తించారు. స్టేషన్‌లో అందుబాటులో ఉన్న రైల్వే సిబ్బంది వెంటనే దానికి మరమ్మతులు చేశారు. దాదాపు 20 నిమిషాల తర్వాత రైలు మళ్లీ బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Old Cars – MLAs : ఎమ్మెల్యేలు, మంత్రులకు పాత కార్లే.. కొత్తవి కొనేది లేదు : సీఎం

  Last Updated: 10 Dec 2023, 11:06 AM IST