Smitha Sabarwal Out Amrapali In : స్మితా సబర్వాల్ స్థానంలో ఆమ్రపాలి..?

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 03:23 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి రావడం తో గత ప్రభుత్వం లో పలు శాఖల్లో పనిచేసిన వారిని ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ వేరే వారిని ఆ స్థానంలోకి తీసుకుంటున్నారు. ఇప్పటీకే పలు శాఖల్లో మార్పులు జరుగగా..తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అదనపు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ (Smitha Sabarwal) స్థానంలో ఆమ్రపాలి (Amrapali ) ని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మొన్నటివరకు కేసీఆర్ టీమ్ లో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లుగా టాక్. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్.

సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే కొత్త సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించడం లేదు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమైన అధికారులు అంతా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ, స్మితా సబర్వాల్ మాత్రం ఇంతవరకు సీఎం రేవంత్ ను కలవలేదు. తన భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. తాను కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. తాజాగా స్మితా సబర్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు. కొత్త ఛాలెంజ్ లకు ఎప్పుడూ సిద్ధమే అంటూ పోస్టు పెట్టారు. దీనిని బట్టి చూస్తే స్మితా తెలంగాణ కు బై బై చెప్పబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

స్మితా సబర్వాల్ స్థానంలో తెలంగాణ సీఎం ఆఫీసులోకి ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి జాయిన్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి తెలంగాణకు వచ్చిన ఆమ్రపాలి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కార్యదర్శిగా.. అంటే సీఎంవో సెక్రటరీగా వస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఏపీలో 2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌గా అలాట్ అయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమె.. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా కొంతకాలం పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్‌కు వెళ్ళిన ఆమ్రపాలి.. ముందు కేంద్ర క్యాబినెట్‌లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది పనిచేశారు. ఆ తర్వాత పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆమె తిరిగి వచ్చేందుకు వీలుగా కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు.

Read Also : Parliament: పార్లమెంట్‍పై దాడి చేసిన నిందితులు గుర్తింపు