Site icon HashtagU Telugu

Smita Sabharwal Tweet : మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలపై స్మితా సభర్వాల్ క్లారిటీ..

Smita Sabharwal Tweet

స్మితా సభర్వాల్ (Smita Sabharwal )..గత మూడు రోజులుగా ఈమె పేరు మీడియా లో , సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ సర్కార్ (BRS Govt) అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ (KCR) మెప్పు పొందిన అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంవో (CMO) ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాంటి కీలక బాధ్యతలు చేపట్టిన ఈమె..కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపించకపోవడం..కనీసం సీఎం ను కలవకపోవడం ఫై ఈమె ఫై అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తుందని..ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని వార్తలు బయటకు వచ్చాయి. ఇదే క్రమంలో మాజీ ఐఏఎస్ లు సైతం ఈమె ఫై సంచలన వ్యాఖ్యలు చేయడం చేసారు. ఇలా ఈమె పేరు మారుమోగిపోతుంది.

ఈ తరుణంలో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆమె ఫై వస్తున్న వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని , తాను కేంద్ర సర్వీసులకు వెళ్లడం లేదని స్మితా సభర్వాల్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా ఇక్కడే ఉంటానని స్మిత తేల్చి చెప్పేశారు. అలాగే తెలంగాణలో కొత్త సర్కార్‌ ఇచ్చే ఏ బాధ్యత అయినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో స్మితా సభర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్తారన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.

Read Also : Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్