Smita Sabharwal : తనఫై వస్తున్న ట్రోల్స్ కు సమాధానం చెప్పిన స్మితా సబర్వాల్

స్మితా సబర్వాల్ (Smita Sabharwal)..గత కొద్దీ రోజులుగా వార్తల్లో తెగ చక్కర్లు కొడుతున్న పేరు. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాంటి ఈమెఫై కొద్దీ రోజులుగా ఓ వివాదం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మంత్రిగా సీతక్క (Minister Sithakka) బాధ్యతలు తీసుకున్న సమయంలో.. మిషన్ భగీరథ ఇంఛార్జ్‌గా ఉన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ […]

Published By: HashtagU Telugu Desk
Smitha

Smitha

స్మితా సబర్వాల్ (Smita Sabharwal)..గత కొద్దీ రోజులుగా వార్తల్లో తెగ చక్కర్లు కొడుతున్న పేరు. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాంటి ఈమెఫై కొద్దీ రోజులుగా ఓ వివాదం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మంత్రిగా సీతక్క (Minister Sithakka) బాధ్యతలు తీసుకున్న సమయంలో.. మిషన్ భగీరథ ఇంఛార్జ్‌గా ఉన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో.. స్మితా సబర్వాల్ కాలు మీద కాలేసుకుని కూర్చోవటంపై చాలామంది ట్రోల్స్ చేశారు. ఇన్నాళ్లు దొర దగ్గర పని చేసి, ఇప్పుడు దళిత నాయకురాలితో పని చేయాల్సి రావటంతో.. ముందు ఉన్నది మంత్రి అన్న గౌరవం కూడా లేకుండా అహంకారంతో కాలు మీద కాలేసుకుందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ట్రోల్స్ ఫై తాజాగా స్మిత క్లారిటీ ఇచ్చారు. అలా కూర్చోవడం తన ఆహార్యం తప్ప మరోటి కాదని స్పష్టం చేశారు. కాదూ.. అలా కూర్చోకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉంటే చెబితే తన పద్ధతి మార్చుకుంటానని సెటైర్ వేశారు. తనకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా కూర్చుంటానని స్ఫష్టం చేశారు. తన వయసు ఇప్పుడు 47 సంవత్సరాలని, ఈ వయసులో ఎలా కూర్చోవాలో, ఎలా నిల్చోవాలో ఒకరు చెప్పాల్సిన పనిలేదని అన్నారు. నిజానికి అందులో ఎలాంటి వివాదమూ లేదని, ఎవరో ఫొటోగ్రాఫర్ దానిని క్లిక్ మనిపిస్తే మరెవరో దానిని ట్రోల్ చేశారని, ఒకరకంగా ఈ వివాదానికి మీడియానే కారణమని నిందించారు.

Read Also : Income Tax Officer: ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ కావాల‌ని ఉందా..? అయితే ఈ అర్హ‌త‌లు ఉండాల్సిందే..!

  Last Updated: 13 Mar 2024, 02:03 PM IST