Site icon HashtagU Telugu

Telangana Elections 2023 : కాంగ్రెస్ కే ‘జై’ అంటున్న చిన్న పార్టీలు..మరి ఫలితం ఎలా ఉంటుందో..?

Jai Congress

Jai Congress

తెలంగాణ ఎన్నికల (2023 Telangana Elections) సమయం దగ్గరపడింది. దీంతో అధికార పార్టీ (BRS) తో పాటు మిగతా పార్టీలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేయడం తో పాటు విమర్శల అస్త్రాలను సైతం పెంచుతున్నారు. గత ఎన్నికలు ఓ లెక్క..ఈసారి ఎన్నికలు ఓ లెక్క అనేలా ఉంది. ఆరు నెలల క్రితం వరకు కూడా అంత బిఆర్ఎస్ vs బిజెపి (BRS VS BJP) గా ఈసారి ఎన్నికలు ఉండబోతాయని లెక్కలు వేశారు. కానీ ఆ లెక్కలన్నీ తారుమారు చేసింది కాంగ్రెస్ (Congress). ఇప్పుడు బిఆర్ఎస్ vs కాంగ్రెస్ గా మారింది. రోజు రోజుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు మరింతగా పెరుగుతుంది. బిఆర్ఎస్ , బిజెపి పార్టీల నుండి పెద్ద ఎత్తున కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడం..బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం చేతి కిందకు రావడం తో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలం పెరిగింది.

ఇదే కాదు రాష్ట్రంలో ఉన్న చిన్న , చితక పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కి జై కొట్టడం..కాంగ్రెస్ కు మరింత ఉపుచ్చేలా చేస్తుంది. సాదారణంగా రాజకీయ పార్టీలు ఎంత చిన్నవైనా ఉత్తినే ఇతర పార్టీలకు మద్దతిచ్చేందుకు అంగీకరించవు. రాజకీయంగా ఏదో ఓ ప్రయోజనాన్ని ఆశిస్తాయి. అయితే ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో చిన్న పార్టీలు రాజకీయ ప్రయోజనాలను ఏమాత్రం ఆశించకుండా..కేసీఆర్ (CM KCR) ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమన్ని జేఏసీ చైర్మన్ గా ముందుండి నడిపించిన ప్రోఫెసర్ కోదండరాం (Kodandaram)..తన మద్దతును కాంగ్రెస్ కు ప్రకటించారు. మొన్నటి వరకు తెలంగాణ లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చిన YSRTP అధినేత్రి షర్మిల (YS Sharmila) సైతం ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని , తన సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని అధికారికంగా తెలిపింది. సిపిఐ సైతం కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుంది. మొన్నటి వరకు సిపిఎం కూడా కాంగ్రెస్ తో నడవాలని చూసిన పొత్తు కుదరకపోయేసరికి ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఇంకా సీపీఎం జాతీయ నేతలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతూనే ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ కూడా ఎన్నికల బరినుండి తప్పుకుంది. టిడిపి తప్పుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకే మేలు జరుగుతుందన్న అభప్రాయం వినిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ, బీఆర్ఎస్‌కు టీడీపీ సానుభూతిపరులు వ్యతిరేకమయ్యారని ..వారంతా కాంగ్రెస్ పార్టీ కే జై కొట్టడం ఖాయమని తెలుస్తుంది. ఇలా అన్ని పార్టీ లు కాంగ్రెస్ కు ‘జై’ కొడుతుండడం తో..సింగిల్ గా బరిలోకి దిగుతున్న బిఆర్ఎస్…కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్న పార్టీల ఫై విమర్శలు సంధిస్తోంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో..కాంగ్రెస్ కు జై కొడతారా..? లేక బిఆర్ఎస్ కు జై కొడతారా..? అనేది చూడాలి.

Read Also : BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన యునైటెడ్ ముస్లిం ఫోరం