Komatireddy Rajagopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసేలా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన తన వ్యాఖ్యలతో ఆయన మీడియా వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ సెన్సేషన్ సృష్టించారు. రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా.. “ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సరికాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచే తన శక్తి కొద్దీ కృషి చేస్తోంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలని ప్రధాన మీడియా వారిని ఎగదోయడం విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు.”
Yemen: యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం.. 68 మంది శరణార్థులు మృతి..
ఈ ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా, ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోనే రాజగోపాల్ రెడ్డి గళం వినిపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల జరిగిన ‘నవ తెలంగాణ’ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి నాంది పలికాయి. ఆయన మాట్లాడుతూ జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు.
“రాష్ట్రంలో కనీసం ఓనమాలు కూడా లేని వారు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టులుగా మారారు. అలాంటి వారిని సీనియర్ జర్నలిస్టులు పక్కన పెట్టాలి, కనీసం పక్కన కూడా కూర్చోబెట్టుకోవద్దు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్టు అని చెప్పుకోవడం శోచనీయం.” సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియా జర్నలిస్టులు తీవ్రంగా స్పందించారు. నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు ప్రకటించడం ఈ వివాదాన్ని మరింత రాజకీయ రంగు పులుముతోంది.
రాజగోపాల్ రెడ్డి ట్వీట్‌ను కొందరు రాజకీయ విశ్లేషకులు సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్ష దాడిగా భావిస్తున్నారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఇది మరో కొత్త మలుపు తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు ప్రకటించిన రాజగోపాల్ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో పార్టీ లోపలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది.
Healty Fruit : మెదడు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు చేకూర్చే ఫలం.. ట్రై చేసి చూడండి