Site icon HashtagU Telugu

SLBC Tunnel : మళ్లీ కూలే ప్రమాదం..చిక్కుకున్న కార్మిలకులపై ఆశలు వదులుకోవాల్సిందే

Slbc Tunnel Operation Updat

Slbc Tunnel Operation Updat

నల్లగొండ జిల్లా SLBC టన్నెల్ ప్రమాదం హృదయవిదారక స్థితిని కలిగిస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి రెస్క్యూ బృందాలు 8 మంది కార్మికుల కోసం శ్రమిస్తున్నాయి. కానీ టన్నెల్ లోపలికి వెళ్లేందుకు వస్తున్న అడ్డంకుల వల్ల సహాయక చర్యలు ముందుకు సాగడం చాలా కష్టంగా మారింది. NDRF, SDRF, నేవీ, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్ సహా అనేక ప్రత్యేక బృందాలు కార్మికుల ఆచూకీ కోసం శ్రమిస్తున్నాయి. అయితే టన్నెల్ లోపల ఆక్సిజన్ లేమి, బురద, గండ్లు సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. రెస్క్యూ టీమ్‌లు కన్వేయర్ బెల్ట్‌ను రిపేర్ చేసి బురదను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. కానీ మరింత లోతుగా వెళ్లే అవకాశం లేదని రెస్క్యూ టీమ్‌లు చెపుతున్నాయి.

Gudem Mahipal Reddy : ‘హస్తం వద్దు..కారే ముద్దు’ అని డిసైడ్ అయ్యాడా..?

టన్నెల్‌లో అడ్డుగా నిలిచిన TBM మెషిన్‌ శిథిలాలను తొలగించేందుకు ఎల్ అండ్ టీ, నవయుగ, మేఘా కంపెనీల నిపుణులు పనిచేస్తున్నారు. అయితే బురద 15 అడుగుల ఎత్తుకు పేరుకుపోవడం, గంటకు 5000 లీటర్ల ఊట ప్రవహించడం, సెగ్మెంట్ బ్లాక్స్ నుంచి నీటి లీకేజీ రావడం వంటి సమస్యలు సహాయక చర్యలను మరింత సంక్లిష్టతరం చేస్తున్నాయి. టన్నెల్‌లో పరిస్థితి మరింత దిగజారుతున్నందున ఎన్జీఆర్ఐ నిపుణులు సహాయక బృందాలకు అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని హెచ్చరించారు. డ్రోన్లు, కెమెరాలు, ఇతర ఆధునిక పరికరాలు ఉపయోగించినా కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో చిక్కుకున్న కార్మికుల ఫై ఆశలు వదులుకోవాల్సిందే అని అంత అభిప్రాయపడుతున్నారు.

Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల

ఈ ప్రమాదానికి కారణాలను విశ్లేషించేందుకు జీఎస్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు బురద స్థాయిని అంచనా వేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయక బృందాలతో సమీక్షలు నిర్వహించారు. ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ కలిసి మరోసారి ప్రయోగాత్మకంగా టన్నెల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్ పైభాగం నుండి గానీ, పక్కదారి ద్వారా గానీ లోపలికి ప్రవేశించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. 8 మంది కార్మికుల ప్రాణాలను కాపాడటం ప్రథమ ప్రాధాన్యమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. సహాయక చర్యలు మరింత వేగంగా, విస్తృతంగా చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.