SLBC Incident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ కాల్ చేశారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిన చోట చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ వివరాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆయన ఆరా తీశారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదలొద్దని రేవంత్‌కు రాహుల్ సూచించారు. వీరిద్దరి ఫోన్ కాల్ సంభాషణ దాదాపు నిమిషాల పాటు కొనసాగింది.
Also Read :Gold Rate : 50 రోజుల్లోనే రూ.9500 పెరిగిన బంగారం రేటు.. ఎందుకు ?
‘‘ఆ ప్రమాద ఘటన(SLBC Incident) జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్ ఘటనా స్థలానికి వెళ్లారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులకు చికిత్స జరుగుతోంది’’ అని రాహుల్‌కు సీఎం రేవంత్ చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర సర్కారు స్పందించిన తీరును రాహుల్ కొనియాడారు. చిక్కుకున్న వారిని రక్షించే విషయంలో సర్వశక్తులు ఒడ్డాలని రేవంత్‌కు నిర్దేశించారు. ఇక ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో జరుగుతున్న రెస్క్యూ వర్క్‌లో 24 మందితో కూడిన ఆర్మీ టీమ్ కూడా పాల్గొంటోంది. 130 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్, 24 మందితో కూడిన హైడ్రా టీమ్, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్, 120 మంది ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో భాగమయ్యారు. ఘటనాస్థలంలో కూలిన మట్టి దిబ్బలు, పేరుకుపోయిన నీటివల్ల సహాయ చర్యలు వేగవంతంగా జరగడం లేదు.
Also Read :God Chip : ప్రపంచాన్ని మార్చేసే ‘గాడ్ చిప్’.. ఏం చేస్తుందో తెలుసా ?
మంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే..
టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలను కాపాడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. శనివారం రాత్రి నుంచి 14 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం లోపలికి వెళ్లగలిగినట్లు వెల్లడించారు. టన్నెల్ బోర్ మెషిన్ లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు.
చిక్కుకున్నది ఎవరు ?
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి వివరాల్లోకి వెళితే.. జేపీ సంస్థకు చెందిన మనోజ్‌కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్‌ఈ), కార్మికులు సందీప్‌సాహు (28), జక్తాజెస్ (37), సంతోష్‌సాహు (37), అనూజ్ సాహు (25) ఉన్నారు. రాబిన్‌సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురుదీప్ సింగ్ (40) సొరంగం లోపల విధుల్లో ఉన్నారు. జమ్మూ, పంజాబ్, జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పని చేస్తున్నారు.