Skill Development Courses : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉన్న 100 డిగ్రీ కాలేజీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని డిసైడ్ చేశారు. సెక్టార్ స్కిల్ కౌన్సిళ్లు, కళాశాల విద్యాశాఖ, వర్సిటీల అధికారులతో తాజాగా నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం నిర్ణయం తీసుకున్నారు. చదువుతూనే పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించుకునేంతగా డిగ్రీ కాలేజీల విద్యార్థులలో స్కిల్స్‌ను డెవలప్ చేసే లక్ష్యంతో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. డిగ్రీ పూర్తయ్యే సమయానికి ఏదో ఒక స్కిల్‌పై విద్యార్థులకు పట్టును పెంచేలా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను(Skill Development Courses) బోధించాలని భావిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
36 నుంచి 100కు పెరిగిన కోర్సులు
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో 30 డిగ్రీ కాలేజీల్లోనే 36 కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 100కు పెంచనున్నారు. ఏయే రంగాలకు సంబంధించిన ఏయే కోర్సులను ప్రవేశపెట్టొచ్చో గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు అధికంగా ఉన్న కాలేజీల్లో ఈ కోర్సులకు ప్రవేశపెడతారు. ఎంపిక చేసే ప్రైవేట్ కాలేజీలకు కూడా ఈ అవకాశం కల్పిస్తారు. తెలంగాణలో కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్సులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి.
Also Read :Inter Hall Tickets : నేటి నుంచే ‘ఇంటర్’ హాల్‌టికెట్స్ రిలీజ్.. ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదీ
కోర్సులివే..
డిగ్రీ కాలేజీల విద్యార్థులకు నేర్పించాలని భావిస్తున్న వాటిలో 27 ముఖ్యమైన స్కిల్ కోర్సులు ఉన్నాయి. మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన ఈ కోర్సుల జాబితాలో.. ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్‌ఎస్‌ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ వంటివి ఉన్నాయి.