Telangana: రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ఆరుగురు, ఏపీకి ముగ్గురు అధికారులను కేటాయించారు.
తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది . ఈ మేరకు 2022 బ్యాచ్‌కు చెందిన అయేషా ఫాతిమా, మంధరే సోహమ్ సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, తుత్విక్ సాయిలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అదనపు ఐపీఎస్ అధికారులను కేటాయించాలని అభ్యర్థించారు. తెలంగాణకు 76 మంది ఐపీఎస్‌లు మాత్రమే కేటాయించారని, మరో 29 పోస్టులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ఆరుగురు ఐపీఎస్ అధికారులను ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ముగ్గురు ఐపీఎస్‌లను మాత్రమే కేటాయించింది.
Also Read: Prabhas Raja Saab : రాజా సాబ్ కథ.. అర్రెర్రె అనేసిన మారుతి..!