Site icon HashtagU Telugu

Telangana: ప్రవళ్లిక ఆత్మహత్య కేసులో శివరాం రాథోడ్‌కు బెయిల్‌ మంజూరు

Telangana (43)

Telangana (43)

Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

55 వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇచ్చి ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరాం రాథోడ్‌ పాత్రపై సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేసింది.

దీనిపై శివరామ్ సోదరుడు మునిరామ్ రాథోడ్ స్పందించారు. పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. డిఫెన్స్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వవద్దని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. పోలీసులు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు? పోలీసులు కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మునిరామ్ ఆరోపించారు.

Also Read: MS Dhoni: ధోనికి అరుదైన గౌరవం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Exit mobile version