Sitarama Project : ట్రయల్ రన్ సక్సెస్..10 లక్షల ఎకరాలకు అందనున్న సాగు నీరు

ఈ ప్రాజెక్టు మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనుంది. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది

Published By: HashtagU Telugu Desk
Sitharama Project

Sitharama Project

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్‌రన్‌ సక్సెస్ అయ్యింది. గత కేసీఆర్(KCR) ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) మోటార్ల ట్రయిల్ రన్ సక్సెస్‌( Motors Trail Run Success) అయ్యింది. గురువారం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్‌రన్‌లో పాల్గొని అధికారులతో కలసి పంప్ హౌస్ మోటార్ల పనితీరును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) పరిశీలించారు. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలు సస్య శ్యామలం కానున్నాయి. వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు పారేలా చర్యలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనుంది. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

We’re now on WhatsApp. Click to Join.

సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లా ప్రజల కలల ప్రాజెక్ట్ గా చెబుతుంటారు. నాడు టీడీపీ ఈ తరహా ప్రాజెక్ట్ కోసం తుమ్మల ప్రయత్నాలు చేసినప్పటికీ నిధుల సమస్యతో ఉమ్మడి రాష్ట్రంలో ఆ కల సాకారం కాలేదు. అనంతరం కేసీఆర్ కేబినెట్ లో తుమ్మలకు అవకాశం దక్కడంతో సీతారామకు పునాది పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా భూముల్లో పచ్చని పంటలు పండాలంటే సాగు నీటి ప్రాజెక్ట్ ఎంతో అవసరమని భావించిన తుమ్మల గోదావరి జలాలను లిఫ్ట్ చేసేలా తనకున్న అనుభవంతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. సాగు నీటి ప్రాజెక్ట్ లతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణం చేయాలనే సంకల్పంతో ఉన్న కేసీఆర్… తుమ్మల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి ప్రాజెక్ట్ పేరును శ్రీ రాముడు కొలువైన ప్రాంతం భద్రాచలం కావడంతో “సీతారామ” ప్రాజెక్ట్ గా నాడు కేసీఆర్ నామకరణం చేశారు.

సీతారామ ప్రాజెక్ట్ కు 2016 ఫిబ్రవరి 16న నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై కాటన్ నిర్మాణం చేసిన దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్ధ్యంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. సీతమ్మ సాగర్ బ్యారేజ్ 36 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతుండగా గోదావరి జలాలను లిఫ్ట్ చేసి స్టోర్ చేసేందుకు రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి గా తుమ్మలకు అవకాశం దక్కడంతో సీతారామ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత ఐదేళ్లుగా నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. ఈరోజు ట్రయిల్ రన్ సక్సెస్ కావడం తో మంత్రులు ..ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు.

Read Also : RGV Kalki : కల్కి కి షాక్ ఇచ్చిన వర్మ..ఇలా చేస్తాడని ఎవరు ఊహించరు

  Last Updated: 27 Jun 2024, 12:20 PM IST