Site icon HashtagU Telugu

Disha Encounter : దిశ ఎన్ కౌంటర్ బూటకం: తేల్చిన సిర్పూర్కర్ కమిషన్

Disha Encounter

Disha Encounter

దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశ ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ రిపోర్టును ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ రిపోర్టు అందజేసింది. ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పౌరహక్కుల సంఘం నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సిర్పూర్కర్ కమిషన్ ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని సిర్పూర్కర్ కమిషన్ తన రిపోర్టులో స్పష్టం చేసిందని పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది తెలిపారు. ఈ రిపోర్టు సారంశం కోర్టులో తమకు చదివి వినిపించారని చెప్పారు.

ఈ రిపోర్టు కాపీలను అందరికీ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్ కౌంటర్ లేకపోతే కేసును సుప్రీంకోర్టు ముగించేసేదని న్యాయవాది కృష్ణ తెలిపారు. అయితే బూటకపు ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. తెలంగాణ హైకోర్టులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై విచారణ జరుగుతుందని చెప్పారు.