Site icon HashtagU Telugu

Sircilla Ganja: తాత ఇంటి పెరట్లో గంజాయి సాగు

Sircilla Ganja

Sircilla Ganja

Sircilla Ganja: తెలివి ఉండాలే కానీ బ్రతుకు ఒక లెక్క కాదు. బ్రతకడం తెలిసినోడు ఎలాగైనా బ్రతికేస్తాడు. ఇది కలికాలం, ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి అనేది రాజ్యాంగంలో ఉంటే నాకేంటి, నా జీవితం నా ఇష్టం అనుకున్నాడో ఏమో గానీ ఓ పెద్దాయన చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు. పెరట్లో పండ్ల చెట్లు, కూరగాయలు పండిస్తుంటారు. కానీ ఈ పెద్దాయన మాత్రం తన పెరట్లో గంజాయి సాగు చేస్తున్నాడు. ఏళ్లుగా తన పెరట్లో గంజాయి సాగు చేస్తూ దాన్ని వ్యాపారంగా మార్చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి చూస్తే అవాక్కవడం వాళ్ళ వంతు అయింది.

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌లో నివాసముంటున్న ఎండీ హైదర్ సుమారు ఆరు అడుగుల ఎత్తులో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. హైదర్ గంజాయి పండించడమే కాకుండా యువకులకు విక్రయించేవాడు. సిరిసిల్ల పోలీసులు ఈ నెల 28వ తేదీ గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఇంటి పెరట్లో ఉన్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి పెరట్లో దాదాపు 31 గంజాయి చెట్లను గుర్తించారు. దీంతో గంజాయి మొక్కలను పీకేసి హైదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం (NDPS) కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

Also Read: Balochistan Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి