తెలంగాణలోని చిన్న పరిశ్రమల (Small Industries) అవసరాలను గుర్తించిన సింగరేణి (Singareni ) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో ఉన్నంటువంటి పరిశ్రమలు ఇప్పటివరకు రామగుండం, కొత్తగూడెం వంటి దూర ప్రాంతాల నుంచి బొగ్గు తరలించుకునేవి. దీనివల్ల భారీ రవాణా ఖర్చులను భరించాల్సి వచ్చింది. దీంతో బొగ్గు వినియోగం తగ్గడంతో పాటు సింగరేణికి ఆశించిన ఆదాయం రాలేదు. ఈ సమస్యల పరిష్కరించించేందుకు హైదరాబాద్ నగరంలోనే బొగ్గు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. నగరానికి సమీపంలో ఉన్న పరిశ్రమలకు తక్కువ ఖర్చుతో వేగంగా బొగ్గు అందించడం వల్ల విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. ఆయన చెబితేనే చేశామని ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్
హైదరాబాద్ కేంద్రంగా విక్రయ కేంద్రం ఏర్పాటు వల్ల సింగరేణికి లాభాలు వచ్చే అవకాశం ఎంతగానో ఉంది. రైలు మార్గం ద్వారా తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో బొగ్గును తరలించవచ్చుననే సౌలభ్యం ఉండటంతో సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. బహిరంగ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, నేరుగా వినియోగదారులకు బొగ్గును విక్రయించాలన్న యాజమాన్య ఉద్దేశం, చిన్న పరిశ్రమలకు మేలు చేసేలా ఈ నిర్ణయం ఉండనుంది. దాంతో పాటు సింగరేణి కార్మికులకు దీని వల్ల లాభాలు కూడా ప్రత్యక్షంగా చేరే అవకాశం ఉంది. ఇది పరిశ్రమలకు పెద్ద ఊరటగా మారే అవకాశం ఉంది.
Kuberaa Telugu Review: ఇరగదీసిన ధనుష్ – నాగార్జున | మనీ, ఎమోషన్, మానవత్వం మేళవించిన కుబేర
ఈ ప్రణాళికలో నాణ్యత విషయంలో కూడా యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. నిమ్న నాణ్యత కలిగిన జీ14, జీ15 గ్రేడ్ బొగ్గును విక్రయించకుండా, కేవలం ఉత్తమ నాణ్యత కలిగిన జీ13 బొగ్గును మాత్రమే బహిరంగ మార్కెట్‌లోకి అందించాలనే నిర్ణయం తీసుకుంది. ఇది సింగరేణి ప్రతిష్టను మరింత పెంచే దిశగా వ్యవహరించనుంది. ఇక హైదరాబాద్ కేంద్రంగా ఈ బొగ్గు విక్రయ కేంద్రం వేగంగా ప్రారంభమైతే, సింగరేణి బహిరంగ మార్కెట్‌లో తన సత్తా చాటుతుందని, సంస్థ విజయవంతంగా మరో అడుగు ముందుకేస్తుందని స్పష్టంగా కనిపిస్తోంది.