Singareni Record: బొగ్గు రవాణాలో ‘సింగరేణి’ ఆల్ టైమ్ రికార్ట్!

జనవరిలో కంపెనీ 68.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది.

Published By: HashtagU Telugu Desk
Singareni

Singareni

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) బొగ్గు ఉత్పత్తిని దూకుడుగా పెంచుతోంది. జనవరి (January) లో కంపెనీ 68.4 లక్షల టన్నుల బొగ్గు (Coal)ను రవాణా చేసి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. గతంలో 64.7 లక్షల టన్నుల బొగ్గు (Coal) రవాణాను మార్చి 2016లో సాధించారు మొన్నటి వరకు ఇదే రికార్డు. ఈ జనవరి నెల బొగ్గు (Coal) రవాణా ఆ రికార్డును బద్దలు కొట్టింది.

బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, జనవరిలో, 11 ప్రాంతాల నుండి రోజుకు సగటున 39 రైల్ కార్ల చొప్పున మొత్తం 1216 ప్యాలెట్ల బొగ్గు రవాణా (Transport) చేయబడిందని కంపెనీ తెలియజేసింది. బొగ్గులో ఎక్కువ భాగం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్ పవర్ స్టేషన్‌లకు రవాణా చేశారు. జనవరి నెలలో సింగరేణి అత్యధికంగా బొగ్గు రవాణాను సాధించింది. రాబోయే 60 రోజుల పాటు ఇదే పనితీరును కొనసాగించగలిగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యమైన 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సులభంగా అధిగమించగలమని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ (MD. Sridhar) తెలిపారు.

Also Read: Re-introducing Brahmanandam: నెవర్ బిఫోర్ అవతార్ లో కామెడీ కింగ్ బ్రహ్మానందం!

 

  Last Updated: 02 Feb 2023, 12:09 PM IST