Site icon HashtagU Telugu

Sircilla: 27 సుగంధ ద్రవ్యాలతో పట్టుచీర..సిరిసిల్ల నేతన్న వినూత్న ఆలోచన..!!

Ktr

Ktr

సిరిసిల్లా అంటేనే చేనేతకు కేరాఫ్ అడ్రస్. అక్కడ తయారు చేసే వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా అందించే బతుకమ్మ చీరలు కూడా సిరిసిల్లా నేతన్నలు తయారు చేసినవే. అయితే సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో  పట్టు చీరను తయారు చేశాడు. 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీరను తయారు చేశాడు. ఆ చీరను మంత్రులు మంత్రి కేటీఆర్, హారీశ్ రావు ఆవిష్కరించారు.

విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చందన పట్టుగా నామకరణం చేశారు మంత్రులు. వినూత్నం ఆలోచించి పట్టు చీరు తయారు చేసిన యువ చేనేత కళాకారుడు విజయ్ ను మంత్రులు అభినందించారు.

 

Exit mobile version