Gunman Commits Suicide : ‘అప్పు’ నలుగుర్ని బలి తీసుకుంది ..కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య

‘అప్పు’ అంటే విరోధమే..అప్పుచేసి పప్పుకూడు..అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు’ ఇలా పెద్దలు చెపుతుంటారు. అప్పు అనేది ఆ క్షణం బాగానే ఉన్న..ఆ తర్వాత మనిషిని ప్రశాంతంగా ఉంచదు..నిత్యం నీడలా మనవెంట ఉంటూ మనల్ని వేదిస్తుంటుంది. ఇలా చాలామంది అప్పు చేసి..ఆ అప్పు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో..వారు ఒక్కరే కాదు..కుటుంబం మొత్తాన్ని కూడా హత్య చేసి..చివరికి వారు సైతం ప్రాణాలు వదిలిన ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా సిద్దిపేట లో ఇదే […]

Published By: HashtagU Telugu Desk
Gunman Commits Suicide

Gunman Commits Suicide

‘అప్పు’ అంటే విరోధమే..అప్పుచేసి పప్పుకూడు..అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు’ ఇలా పెద్దలు చెపుతుంటారు. అప్పు అనేది ఆ క్షణం బాగానే ఉన్న..ఆ తర్వాత మనిషిని ప్రశాంతంగా ఉంచదు..నిత్యం నీడలా మనవెంట ఉంటూ మనల్ని వేదిస్తుంటుంది. ఇలా చాలామంది అప్పు చేసి..ఆ అప్పు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో..వారు ఒక్కరే కాదు..కుటుంబం మొత్తాన్ని కూడా హత్య చేసి..చివరికి వారు సైతం ప్రాణాలు వదిలిన ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా సిద్దిపేట లో ఇదే జరిగింది. అప్పు కారణంగా కలెక్టర్ వద్ద గన్‌మెన్ గా వ్యవహరిస్తున్న నరేష్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని మొత్తం గన్ తో కాల్చి..ఆ తర్వాత తాను కూడా కాల్చుకొని చనిపోయాడు. ఈ ఘటన శుక్రవారం చిన్నకొడూర్ మండలం రాముని పట్లలో జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

కలెక్టర్ వద్ద (Siddipet Collector) PSOగా (Gunman ) విధులు నిర్వహిస్తున్న ఆకుల నరేష్ (Akul Naresh).. రోజు వారీగా విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. స్కూల్ వెళ్లిన పిల్లలను ఇంటికి తీసుకొచ్చి.. తన వద్ద ఉన్న 9MM పిస్టోల్ తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రిలను కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ అయినట్టు సమాచారం. ఈ గొడవల కారణంగా ఆవేశంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

Read Also : Governor Tamilisai Speech : ఇది ప్రజా ప్రభుత్వం.. నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు

  Last Updated: 15 Dec 2023, 01:37 PM IST