Site icon HashtagU Telugu

Siddaramaiah Counter To KTR : కేటీఆర్ కు సిద్దరామయ్య కౌంటర్ .. మీకు ఏది ఫేకో..ఏదో నిజమో తెలియదు

Siddaramaiah Counter To Ktr

Siddaramaiah Counter To Ktr

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) కామెంట్స్ ను బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) ట్విట్టర్ లో షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో అన్నాం అనుకోండి, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రానా అన్ని ఫ్రీగా ఇవ్వాలా మాకు ఇవ్వాలనే ఉంది. కానీ డబ్బులు లేవు అని అసెంబ్లీలో సిద్ధరామయ్య అన్నట్లు ఉన్న ఓ వీడియో ను కేటీఆర్ షేర్ చేసి..దానిపై తన స్పందనను తెలియజేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి డబ్బుల్లేవని సిద్ధరామయ్య అంటున్నారు. హామీలు ఇచ్చే ముందు ఆలోచించరా అని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ (Telangana) భవిష్యత్ కూడా ఇలాగే ఉండబోతుందా అని ధ్వజమెత్తారు. ఏ మాత్రం ప్రణాళిక చేయకుండా అసలు హామీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

దీనిపై సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను అలా అనలేదని తన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అశ్వత్ నారాయణ, సి.టి.రవి దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను అక్కడక్కడ ముక్కలుగా కట్ చేసి.. ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేశారన్నారు. ఇది డీప్ ఫేక్ వీడియోగా స్పష్టం చేశారు. అలాగే కేటీఆర్ కు సైతం చురకలు అంటించారు.

‘తెలంగాణ లో మీ పార్టీ ఎందుకలు ఓడిపోయిందో తెలుసా..కేటీఆర్..? ఎందుకంటే మీకు ఏది ఫేక్..ఏది ఎడిట్ చేసిన వీడియోను తెలియదు. బీజేపీ..ఎడిట్ చేసిన వీడియో ను మీ పార్టీ ప్రచారం చేస్తుంది. మీది బిజెపికి చెందిన ఫర్ఫెక్ట్ బీ టీమ్’ అని సిద్ద రామయ్య ట్వీట్ లో పేర్కొన్నారు.

Read Also : JN.1 Variant: JN.1 వేరియంట్ ఎంత ప్రమాదకరం..? వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు..!?