ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case)లో విచారణ ఎదుర్కొంటున్న శ్రవణ్ రావు(Shravan Rao)కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్లను సిట్ ముందు సమర్పించాలని తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్లపై దృష్టి సారించిన సిట్, వాటి ఆధారంగా మరిన్ని కీలక ఆధారాలను సేకరించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని శ్రవణ్ రావుకు ఆదేశాలు పంపింది.
Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ.. కేకేఆర్‌పై రికార్డు సాధిస్తాడా?
ఇప్పటికే రెండు రోజుల క్రితం సిట్ ఎదుట హాజరైన శ్రవణ్ రావు, తనపై ఉన్న ఆరోపణలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. విచారణ సమయంలో ఆరు గంటల పాటు ప్రశ్నలను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీనితో సిట్ మరింత గమనించి, అతని ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, దీనికి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? దాని వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరు? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. శ్రవణ్ రావు హాజరయ్యాకా కొత్త సమాచారం బయటకు వస్తుందా? లేదా కేసు మరింత ముడిపడి పోతుందా? అన్నది వేచి చూడాల్సిన విషయమే. ఏప్రిల్ 2న అతని విచారణ కీలకంగా మారనుంది.