Telangana: తెలంగాణలో ఇక 24 గంటలు షాపులు తెరిచి ఉంచవచ్చు..!

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం . తెలంగాణలో అన్ని వేళ్లలో షాప్‌లు తెరుచుకునేందుకు ప్రభుత్వం కొత్తగా అనుమతి నిచ్చింది. ఈమేరకు సర్కులర్ జారీ చేసిన తెలంగాణ సర్కార్‌.

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం . తెలంగాణలో (Telangana) అన్ని వేళ్లలో షాప్‌లు తెరుచుకునేందుకు ప్రభుత్వం కొత్తగా అనుమతి నిచ్చింది. ఈమేరకు సర్కులర్ జారీ చేసిన తెలంగాణ సర్కార్‌. తెలంగాణ వ్యాప్తంగా 24/7 షాపులకు తెరుచుకునేందుకు వీలు కల్పిస్తూ.. 24 గంటలూ షాపులు తెరిచేందుకు ఏడాదికి రూ.10వేలు మాత్రం అదనంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. ఉద్యోగులకు సంబంధించిన రికార్డులు మాత్రం ప్రభుత్వానికి అందించాలని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా.. మహిళా ఉద్యోగులకు వారి అనుమతితోనే నైట్‌ షిఫ్ట్‌ వేయాలని, నైట్‌ షిఫ్ట్‌లలో పనిచేసే మహిళలకు వెహికల్‌ పిక్‌ఆప్‌ అండ్‌ డ్రాపింగ్‌, రాత్రి వేళలో పని చేసే మహిళా సిబ్బందికి మరింత భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వెల్లడించింది. సిబ్బందికి ఖచ్చితంగా ఐడీ కార్డులు జారీ చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొంది. లేబర్‌ చట్టాల ప్రకారం పని గంటలు నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు .. ఎక్కువ పని గంటలు చేసినవారికి ఓవర్‌ టైం డబ్బులు ఇవ్వాలని, వీక్‌ ఆఫ్‌లతో పాటు..పండుగలకు సెలవులను ఇవ్వాలని పేర్కొంది.

Also Read:  PM Narendra Modi : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన