తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తీసుకొచ్చిన “రాజీవ్ యువ వికాస్ పథకం”(Rajiv Yuva Vikasam Scheme)కు భారీ స్పందన లభించింది. అర్హులైన అభ్యర్థులకు రూ.4 లక్షల వరకు స్వయం ఉపాధి యూనిట్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ పథకానికి దరఖాస్తు చేశారు. మొదటి విడతలో రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు విలువ గల యూనిట్ల కోసం దరఖాస్తు చేసినవారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావించినా, అనూహ్యంగా దరఖాస్తుల సంఖ్య పెరగడంతో, వాటి పరిశీలన పూర్తి కాక ఆలస్యం జరిగింది.
Rape : చిన్నారిపై రేప్.. నిందితుడి ఎన్‌కౌంటర్
ఈ పథకానికి సంబంధించి తాజాగా అందుతున్న సమాచారం.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. వాస్తవానికి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించినా, లెక్కకు మించి వచ్చిన దరఖాస్తుల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది. పథకం ప్రకారం 50 వేల యూనిట్లకు 100 శాతం, రూ.1 లక్ష వరకు 90 శాతం, రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొదటి విడతలో చిన్న మొత్తాల యూనిట్లకే మంజూరుతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందని భావించారు.
అయితే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బ్యాంక్ సిబిల్ స్కోర్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిబిల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోకూడదని సూచించినప్పటికీ, అధికారులు ఇంకా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు దరఖాస్తుల పరిశీలనలో నిమగ్నమయ్యారు. కుటుంబానికి ఒక్కరికి మాత్రమే పథకం వర్తించనున్న నేపథ్యంలో దరఖాస్తుల ప్రక్రియ అనేది మరింత ఆలస్యం అవుతోంది. మరో రెండు వారాల్లో ఈ ప్రక్రియ ను పూర్తి చేసి అభ్యర్థులకు చెక్స్ పంపిణి అనేది అందజేయాలని ప్రభుత్వం చూస్తుంది.