Site icon HashtagU Telugu

Shocking News for Non-Veg Lovers : హైదరాబాద్ లో చికెన్ , మటన్ షాప్స్ బంద్

Tholi Ekadashi

Tholi Ekadashi

ఒకప్పుడు ఇంటికి బంధువులు వస్తే కానీ ఇంట్లో నాన్ వెజ్ (Non-Veg) అనేది వండేవారు కాదు..కానీ ఇప్పుడు ముక్కలేనిదే ముద్దా దిగడం లేదు. కొంతమంది ప్రతి రోజు నాన్ వెజ్ తినేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ (Telangana) లో నాన్ వెజ్ , మద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే వారికీ నాన్ వెజ్ , మద్యం అందివ్వడం తప్పనిసరి..ఆలా చేయకపోతే వారు తీవ్ర నిరాశకు గురవుతారు. అందుకే తెలంగాణ లో నాన్ వెజ్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక మహానగరం హైదరాబాద్ (Hyderabad) లో చెప్పాల్సిన పనేలేదు. ప్రతి గల్లీలో మూడు , నాల్గు నాన్ వెజ్ షాప్స్ ఉంటాయి. సండే వస్తే క్యూ లో ఉండాల్సిందే. ఆ రేంజ్ లో గిరాకీ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు నాన్ వెజ్ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ). ఈ ఆదివారం (ఏప్రిల్ 21) హైదరాబాద్ వ్యాప్తంగా నాన్ వెజ్ షాప్స్ క్లోజ్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు. ఎవరైనా ఓపెన్ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఎందుకా ఆ రోజు అనుకుంటున్నారా..ఆ రోజు (ఏప్రిల్ 21) మ‌హావీర్ జ‌యంతి (Mahavir Janma Kalyanak).

ఈ సంద‌ర్భంగా సిటీ లో నాన్ వెజ్ షాప్స్ క్లోజ్ చేయాలనీ ఉత్త‌ర్వులు జారీ చేసారు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రొనాల్డ్ రాస్. ఈ ఆదేశాలతో నగర వ్యాప్తంగా సన్ డే మటన్ షాపులతో పాటు కబేళాలు, మీట్, బీఫ్ మార్కెట్స్ అన్ని మూత ప‌డ‌నున్నాయి. సోమ‌వారం తిరిగి య‌థావిధిగా తెరుచుకోనున్నాయి. మరి ఇది గుర్తు పెట్టుకొని ఓ రోజు ముందే మీకు కావాల్సిన నాన్ వెజ్ ను తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి..లేదంటే పస్తులు ఉండాల్సి వస్తుంది.

Read Also : Komatireddy: కాంగ్రెస్‌ను తాకాలని చూస్తే బీఆర్‌ఎస్‌ పునాదులను ధ్వంసం చేస్తాం: కోమటిరెడ్డి