Kidnapping Case: కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి ‘వైశాలి’ వ్యవహారాలు!

రంగారెడ్డి జిల్లో జరిగిన కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగతోంది.

  • Written By:
  • Updated On - December 10, 2022 / 12:09 PM IST

రంగారెడ్డి న‌డిబొడ్డున ఓ యువ‌తిని సినిమా స్టైల్ లో కిడ్నాప్ (Kidnapping Case) యువ‌కుడి నిర్వాకం పోలీసుల‌కు (Police) ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఏ మాత్రం భ‌యం లేకుండా ప‌ట్ట‌ప‌గ‌లు సుమారు 100 మంది యువ‌కుల‌తో వెళ్లి ఇంట్లో ఉన్న యువ‌తిని కిడ్నాప్ (Kidnap) చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే నవీన్ వైశాలి (Vaishali) వ్యవహారం లో  కీలక విషయాలు వెలుగుచూశాయి.

“హిందూ సంప్రదాయం ప్రకారం మాకు పెళ్లి జరిగింది. 2021 ఆగస్టు 4 న బాపట్ల జిల్లా వలపర్ల టెంపుల్ లో మా వివాహం జరిగింది. Bds అయ్యేదాకా పెళ్లి ఫొటోస్ బయటకు రావొద్దని వైశాలి కండీషన్ పెట్టింది. 2021 జనవరి నుంచి ప్రేమలో ఉన్నాం. వైశాలి కుటుంబ సభ్యులు నాతో భారీగా డబ్బులు ఖర్చుపెట్టించారు. వైశాలి తల్లితండ్రులు bds కంప్లీట్ కాగానే పెళ్లి చేస్తామని మాట ఇచ్చి తప్పారు. నా డబ్బు తోనే వైజాగ్,అరకు, వంజంగి, కూర్గ్, మంగుళూరు, గోకర్ణా, గోవాకు వెళ్లారు. వైశాలి పేరు మీద వోల్వోకారు, వైశాలి తండ్రికి రెండు కాఫీ షాపులను రిజిస్ట్రేషన్ చేయించాను. ” అని స్పష్టం చేశాడు నవీన్.

రంగా రెడ్డి జిల్లా ఆదిభ‌ట్ల‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న యువ‌తుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. తూర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నేగుడలోని సిరిటౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ కు గురైన యువ‌తి పేరెంట్స్ ఆదిభ‌ట్ల పోలీసు స్టేష‌న్లో (Police Station) ఫిర్యాదు చేశారు. నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మంది వచ్చి కిడ్నాప్ చేశాడు.

యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారు ధ్వంసం అయ్యాయి. దుండగులను అడ్డుకోబోయిన పక్కింటి వ్యక్తులకు, యువ‌తి పేరెంట్స్ కు గాయాలు అయ్యాయి. ఇంటో ఉన్న‌ సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ తో వచ్చిన మనుషులు తొలుత ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కిడ్నాపర్లను (Kidnapping Case) పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి, అదుపులోకి తీసుకున్నట్టు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు చెప్పారు.

Also Read: Dhamaka Song: హోరెత్తిస్తోన్న రవితేజ ‘దండ కడియాల్’ లిరికల్ సాంగ్!