Delhi Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 11:17 AM IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. కేసు ముడుపుల విషయంలో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ స్కాంలో ఉన్న కంపెనీలకు హైదరాబాద్ కంపెనీల నుంచి భారీగా ముడుపులు అందినట్లు గుర్తించిన ఈడీ శ్రీనివాసరావుకు చెందిన పలు కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఆధారాలు సంపాదించింది.

లిక్కర్ స్కాంలో తెరమీదకు వచ్చిన శ్రీనివాసరావు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సమీప బంధువు . శ్రీనివాసరావును ఏడు గంటల పాటు ఈడీ సుదీర్ఘంగా విచారణ చేసింది. దోమలగూడలోని బుచ్చిబాబు ఇంట్లో సుదీర్ఘంగా సోదాలు చేసింది ఈడీ. హార్డ్ డిస్క్కో కీలక సమాచారం రాబట్టింది. శ్రీనివాసరావు ద్వారానే లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు సంపాదించిది ఈడీ. ఢిల్లీ మద్యం పాలసీలో కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలపై వరుసగా సోదాలు చేసింది ఈడీ. ఢిల్లీ మద్యం సరఫరా చేసిన కంపెనీలకు ఆడిట్ చేసింది గోరంట్ల అసోసియేట్స్. గోరంట్ల కార్యలయంలో
హార్డ్ డిస్క్ లు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ. ఈడీ దర్యాప్తు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. నేడు మరికొంతమందికి నోటీసులు జారీ చేయనున్నారు అధికారులు. నేడు మరోసారి వెన్నమనేని శ్రీనివాసరావును ఈడీ విచారించే అవకాశం ఉంది. పవిత్ర పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు శ్రీనివాస్ రావు డైరెక్టర్ గా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు లో ఉన్న పిళ్లై , అభిషేక్ రావ్ , గండ్ర ప్రేమ్ సాగర్ , సృజన్ రెడ్డిల నుంచి ఈడీ కీలక సమాచారం సేకరించింది.