Site icon HashtagU Telugu

Shocking : `బీఆర్ఎస్` కు చంద్ర‌బాబు షాక్ ! `క‌ల్వ‌కుంట్ల`కు గిలిగింత‌లు!

Shocking

Kcr Babu

దేశంలో ఎవ‌రైనా ఎక్క‌డైనా పార్టీ పెట్టుకోవ‌చ్చు. ఏ రాష్ట్రానికైనా వెళ్లి ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. అదే ఇప్పుడు సీఎం కేసీఆర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని జాతీయ స్థాయికి ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, చంద్ర‌బాబు తెలంగాణ‌లో ఒక స‌భ పెట్టడంగానే క‌ల్వ‌కుంట్ల కుటుంబం (Shocking) వ‌ణికిపోతోంది. మంత్రి హ‌రీశ్ రావు నుంచి లిక్క‌ర్ కేసులో నిందితురాలిగా ఉన్న క‌విత, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ త‌దిత‌రులు చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డానికి క్యూ క‌ట్టారు. ఆయ‌నంటే ఎందుకంత భ‌యం? ఏ పార్టీకిలేని అల‌జ‌డి (Tickles) బీఆర్ఎస్ లోనే ఎందుకు? అనే ప్ర‌శ్న‌లు వేసుకుంటే వ‌చ్చే స‌మాధానం దాదాపు అంద‌రికీ తెలిసిందే.

ఉద్య‌మ పార్టీగా తొలి రోజుల్లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను టీఆర్ఎస్ ఆక‌ట్టుకుంది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2014 ఎన్నిక‌ల నాటికి ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్ ను మ‌లిచారు. ఆ విష‌యాన్ని చెబుతూ తెలుగుదేశం పార్టీలోని స‌మైక్య‌వాదుల‌ను కారు నిండా ఎక్కించారు. రెండోసారి సీఎం అయిన త‌రువాత టీడీపీ లేకుండా చేయాల‌ని సామ‌దాన‌దండోపాయాల‌ను ప్ర‌యోగించారు. యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీ లేద‌ని భావించిన బ‌డుగులు టీఆర్ఎస్ గూటికి చేరారు. కానీ, వాళ్ల‌కు స‌రైన గుర్తింపు కాదుక‌దా, క‌ల్వ‌కుంట్ల కుటుంబ స‌భ్యుల ద‌ర్శ‌నం కూడా గ‌గ‌నం అయింది. దీంతో వెనుక‌బ‌డిన వ‌ర్గాలు ఆ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఆ విష‌యాన్ని మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ప‌లుమార్లు చెప్పారు.

క‌ల్వ‌కుంట్ల కుటుంబం (Shocking)

తాజాగా టీఆర్ఎస్ పార్టీ మూత‌ప‌డింది. దాని స్థానంలో బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చిన కేసీఆర్ ప్ర‌త్యేవాదాన్ని, తెలంగాణ వాదాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. ఫ‌లితంగా బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఉండాలి? అనే ప్ర‌శ్న బీసీ లీడ‌ర్లు వేసుకుంటోన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ సూప‌ర్ హిట్ కావ‌డంతో సొంత పార్టీ వైపు చూస్తున్నారు. ఆ విష‌యాన్ని నిఘా వ‌ర్గాల ద్వారా తెలుసుకున్న కేసీఆర్ జ‌రుగుతోన్న న‌ష్టాన్ని (Shocking) పూడ్చుకునే ప‌నిలో ప‌డ్డారు. ఆ క్ర‌మంలో ఆయ‌న కుటుంబ స‌భ్యులు, ఆయ‌న సామాజిక‌వ‌ర్గంకు చెందిన నేతలు చంద్ర‌బాబు మీద అర్థంలేని దుమ్మెత్తిపోస్తున్నారు.

ఉమ్మ‌డి ఏపీ ఉన్నప్పుడు సీఎంగా చంద్ర‌బాబునాయ‌కుడు చేసిన అభివృద్ధిని మొన్న‌టి వ‌ర‌కు క‌ల్వ‌కుంట్ల కుటుంబం ప్ర‌శంసించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నికల సంద‌ర్భంగా పోటీ ప‌డి చంద్ర‌బాబును పొగిడారు. ఇప్పుడు తెలంగాణ‌ను దోచుకోవ‌డానికి చంద్ర‌బాబు వ‌స్తున్నాడ‌ని ఆరోపించ‌డం తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌కు కూడా అంతుబ‌ట్ట‌కుండా ఉంది. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని క‌ల్వ‌కుంట్ల కుటుంబం వెళ్ల‌డానికి అభ్యంత‌రం ఎక్క‌డా లేదు. కానీ, తెలంగాణ‌కు చంద్ర‌బాబు వ‌స్తే క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి అభ్యంత‌రం ఎందుక‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న ప్ర‌శ్న‌లు. భార‌త దేశాన్ని ఉద్ధ‌రించ‌డానికి బీఆర్ఎస్ జాతీయ స్థాయికి ఎదుగుతోంద‌ని చెబుతున్నారు. అదే, టీడీపీ తెలంగాణలో యాక్టివ్ అయితే దోచుకోవ‌డానికి అంటూ లాజిక్ తీస్తున్నారు.

బీఆర్ఎస్ కు గిలిగింత‌లు 

తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్, లీడ‌ర్ల‌తో నిండిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కానుంద‌ని నిఘా వ‌ర్గాలు ఇచ్చిన రిపోర్ట్ గా ఉందని తెలుస్తోంది. పైగా ఖ‌మ్మం స‌భ స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌చ్చిన జ‌నంతో జ‌రిగిన విష‌యాన్ని కేసీఆర్ కు చేరింద‌ని సొంత పార్టీలోని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. అందుకే, తాజాగా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ ను కూడా రంగంలోకి దింపారు. తెలుగుదేశం పార్టీ చంద్ర‌బాబునాయుడుకు చెందిన పార్టీ కాద‌ని, జూనియ‌ర్ ఎన్టీఆర్ కు అప్పగించాల‌ని స‌రికొత్త డిమాండ్‌కు తెర‌తీశారు. మొత్తం మీద చంద్ర‌బాబు నాయుడు ఖ‌మ్మం స‌భ బీఆర్ఎస్ కు గిలిగింత‌లు(Tickles) పెడుతోంద‌ని క‌ల్వ‌కుంట్ల కుటుంబం రియాక్ష‌న్ ను గ‌మ‌నిస్తే ఎవ‌రైనా ఒక అంచ‌నాకు రావ‌చ్చు.

Also Read : Chandrababu Naidu: మైనార్టీల వైపు చంద్రబాబు!