Site icon HashtagU Telugu

Gaddam Prasad : స్పీకర్ గడ్డం ప్రసాద్ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్ !

Telangana Speaker Gaddam Prasad X Account Hacked

Gaddam Prasad : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు చెందిన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ అయింది. హ్యాక్ చేసిన ఆ అకౌంటులో అసభ్యకరమైన వీడియోలను హ్యాకర్లు పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఈవివరాలను స్వయంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు. ‘‘ఇవాళ ఉదయం నా వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ కాసేపు హ్యాక్ అయింది. మా టెక్నికల్ టీం దీన్ని వెంటనే గుర్తించింది. ఫలితంగా అకౌంటును మేం సత్వరం రికవరీ చేయగలిగాం.  నా అకౌంటు హ్యాక్ అయిన సమయంలో పోస్ట్ అయిన అసభ్యకర వీడియోలు, పోస్టులతో నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను’’ అని గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

కంపెనీ ఇచ్చిన ల్యాప్ టాప్‌లో ఇవి చేయొద్దు 

ఇంట్లో  ఉన్నప్పుడు కూడా పనిచేసేందుకు తమ ఉద్యోగులకు కొన్ని  కంపెనీలు ల్యాప్ టాప్స్ ఇస్తుంటాయి.  కొందరు వాటిని ఇష్టానుసారంగా అన్ని అవసరాలకు వాడేస్తుంటారు. సోషల్ మీడియా అకౌంట్లను చూస్తుంటారు. ఓటీటీల్లో మూవీలు, సీరియల్స్, ఆల్బమ్స్, డాక్యుమెంటరీలను చూసి ఎంజాయ్  చేస్తుంటారు. వాస్తవానికి అలా చేయకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే.. కంపెనీలు మిమ్మల్ని ట్రాక్ చేసేందుకు ఆ ల్యాప్ టాప్‌లో మానిటరింగ్ సాఫ్ట్​వేర్స్, ప్రొడక్టివిటీ సాఫ్ట్​వేర్స్ ఉపయోగించే అవకాశం ఉంది.

Also Read :Chanakya Niti : భార్యాభర్తలకు చాణక్యుడు చెప్పిన నీతిసూత్రాలివీ..

కంపెనీ ఇచ్చిన ల్యాప్​టాప్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని సేవ్ చేసి ఉంచకూడదు. కంపెనీలు ఇచ్చే ల్యాప్​టాప్‌లో వ్యక్తిగత ఈ-మెయిల్​తో లాగిన్ కాకూడదు. మీకు ఆఫీసు ఇచ్చిన ల్యాప్ టాప్‌ను పిల్లలకు, అపరిచితులకు దూరంగా ఉంచాలి. లేదంటే దాన్ని ఎడాపెడా వాడి కీలకమైన కార్యాలయ సమాచారాన్ని డిలీట్ చేసే ముప్పు ఉంటుంది. కంపెనీ వాళ్లు ఇచ్చే ల్యాప్ టాప్‌లలో సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ విభిన్నంగా ఉంటాయి. మనం వాటిని మార్చకూడదు. కంపెనీ ల్యాప్ టాప్‌ను జాగ్రత్తగా వాడితే మన ప్రొఫెషనాలిటీ కూడా నిలుస్తుంది. మన వ్యక్తిగత వివరాలను అందులో పొందుపర్చకుండా వాడుకున్నంత వరకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.