ED Notice: గ్రానైట్ మెటీరియల్‌ లో అవకతవకలు, మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు ‘ఈడీ’ షాక్

ఎన్నికల ముంగిట బీర్ఎస్ మంత్రి గంగులకు బిగ్ షాక్ తగిలింది.

  • Written By:
  • Updated On - September 5, 2023 / 01:25 PM IST

ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ మంత్రి గంగులకు బిగ్ షాక్ తగిలింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)ను ఉల్లంఘించినందుకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానైట్స్, శ్వేతా ఏజెన్సీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. శ్వేతా గ్రానైట్ కంపెనీలు చైనాకు గ్రానైట్ మెటీరియల్‌ను ఎగుమతి చేయడంలో అవకతవకలను ఈడీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి రూ.3కోట్లు మాత్రమే చెల్లించగా దాదాపు రూ.50కోట్లు చెల్లించాల్సి ఉంది.

గతేడాది నవంబర్‌లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావోపేట్‌లోని గ్రానైట్ కంపెనీలపై ఈడీ, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు మూడు రోజుల పాటు దాడులు నిర్వహించారు. శ్వేతా గ్రానైట్స్‌ అధికారిక చిరునామాగా ఉన్న గంగుల కమలాకర్‌ ఇంట్లోనూ, ఆయన నివాసంలోనూ ఈడీ సోదాలు చేసింది. శ్వేత గ్రానైట్ కంపెనీలు, శ్వేత ఏజెన్సీల నుండి రూల్ 26 (3)/ (i) (ii), AP MMC 1996 చట్టం ప్రకారం పెనాల్టీ, సీగ్నియరేజీని వసూలు చేయాలని అధికారులు సంబంధిత అధికారులకు సూచించారు. హవాలా ద్వారా నగదును రవాణా చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు కూడా ఈడీ జారీ చేసిన నోటీసులో పేర్కొంది.

Also Read: Shah Rukh Khan: శ్రీవారి సేవలో జవాన్, కుటుంబ సమేతంగా షారుక్ ఖాన్ పూజలు