Site icon HashtagU Telugu

CS Somesh Kumar: సీఎస్ సోమేష్ కు షాక్.. ఏపీకి వెళ్లాలని హైకోర్టు ఆదేశం!

Somesh Kumar

Somesh Kumar

తెలంగాణ‌ సీఎస్ సోమేశ్ కుమార్ (Somesh Kumar) కు గట్టి షాక్ తగిలింది. చీఫ్ సెక్ర‌ట‌రీగా (CS) తెలంగాణ‌లో సోమేశ్ కుమార్ కొన‌సాగింపును ర‌ద్దు చేస్తూ హైకోర్టు సీజే జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ బెంచ్ తీర్పు వెల్ల‌డించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల‌ని సోమేశ్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది. అయితే రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో సోమేశ్ కుమార్‌ను కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేటాయించింది. దీంతో సోమేశ్ కుమార్ క్యాట్‌ (కేంద్ర ప‌రిపాల‌న ట్రిబ్యున‌ల్‌)ను ఆశ్ర‌యించారు.

ఈ క్ర‌మంలో కేంద్రం ఉత్త‌ర్వులు నిలిపివేసి తెలంగాణ‌లో కొన‌సాగేలా క్యాట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక క్యాట్ మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్వుల‌తో సోమేశ్ కుమార్ (Somesh Kumar) తెలంగాణ‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో క్యాట్ ఉత్త‌ర్వులు కొట్టేయాల‌ని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్ర‌యించింది. క్యాట్ మ‌ధ్యంత‌ర‌ ఉత్త‌ర్వుల‌ను కొట్టివేస్తూ హైకోర్టు (High Court) సీజే ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం తీర్పు వెల్ల‌డించింది.

సోమేష్ కుమార్ (Somesh Kumar) న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేసింది కోర్టు. 2019, డిసెంబ‌ర్ నుంచి తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొన‌సాగుతున్నారు. అయితే సీఎస్ సోమేష్ కుమార్ పదవీలో కొనసాగడాన్ని ప్రతిపక్షాలు సైతం తప్పుపడుతున్నాయి. ఆంధ్రవాళ్లకు తెలంగాణ కీలక పదవులను కట్టాబెట్టారని సీఎం కేసీఆర్ పై కూడా ఆరోపణలు చేశాయి.

Also Read: Modi and KCR: ‘మోడీ – కేసీఆర్’ మళ్లీ ఒక్కటవుతారా?