Site icon HashtagU Telugu

TRS Party: బీఆర్ఎస్ కు షాక్.. టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ!

Ap Politics

Ap Politics

సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. ఆయన బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపాలని ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీ ఆవిర్భవించే అవకాశాలున్నాయి. తెలంగాణ రాజ్య సమితి(TRS) అనే పేరుతో ఈ పార్టీని రిజిస్టర్ చేసినట్టు, త్వరలోనే బహిరంగ ప్రకటనతో ఈ పార్టీ జెండా, అజెండాని జనంలోకి తీసుకు రాబోతున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో ఇదో పెను సంచలనం అంటూన్నారు కూడా. అయితే ఈ డూప్ షాట్ రాజకీయాలు ఎక్కువకాలం చెల్లవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం TRS పేరుని వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలు నెరవేరవని అప్పుడే సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలయ్యాయి. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను పోగేసి కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారట. సరిగ్గా ఎన్నికల ఏడాదిలో వస్తున్న ఈ పార్టీ టార్గెట్ ఏంటనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎన్నికల వేళ, ఆశావహులకు టికెట్ల పేరుతో గాలం వేసి సొమ్ము చేసుకునేందుకే ఈ కొత్తపార్టీ పనికొస్తుందనే ప్రచారం జరుగుతోంది. కొత్త పార్టీ ఏంటి? ఎప్పుడు ఏర్పాటు అవుతుంది? అనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version